తహవ్వుర్ రాణా సిటిజన్షిప్ రద్దుకు కెనడా చర్యలు

తహవ్వుర్ రాణా సిటిజన్షిప్ రద్దుకు కెనడా చర్యలు

ఒట్టావా: ముంబై ఉగ్రదాడి కేసులో ప్రధాన నిందితుడు, పాక్ సంతతి వ్యాపారి తహవ్వుర్  రాణా పౌరసత్వాన్ని రద్దు చేసే ప్రక్రియను కెనడా ప్రభుత్వం ప్రారంభించింది. ఆ దేశ ప్రధాని మార్క్ కార్నీ ఫిబ్రవరి 26న ఇండియా పర్యటనకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలను మెరుగుపరిచే లక్ష్యంతో కెనడా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

తహవ్వుర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాణా ప్రస్తుతం ఇండియాలోని ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఏ అధికారుల కస్టడీలో ఉన్నాడు. అతడు 1997లో కెనడాకు వచ్చాడు. 2001లో ఇమిగ్రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రెఫ్యూజిస్ అండ్ సిటిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ కెనడా(ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీసీ) అతడికి పౌరసత్వం ఇచ్చింది. తహవ్వుర్ రాణా పౌరసత్వాన్ని రద్దు చేయడానికి ఉగ్రవాద ఆరోపణలు కాకుండా, అతడు పౌరసత్వం పొందే సమయంలో తప్పుడు సమాచారం ఇచ్చాడని ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీసీ తెలిపింది.