ముచ్చటగా మూడోసారి..అల్లు అర్జున్ సరసన పూజాహెగ్డే

ముచ్చటగా మూడోసారి..అల్లు అర్జున్ సరసన పూజాహెగ్డే

తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో టాప్ హీరోలతో జోడీ కట్టిన హీరోయిన్‌‌గా మంచి పేరు పొందింది పూజా హెగ్డే. అయితే   కెరీర్‌‌‌‌లో సక్సెస్‌‌లు తక్కువే అయినా వరుస అవకాశాలు మాత్రం దక్కించుకుంటోంది. ఓ వైపు  హీరోయిన్‌‌గా నటిస్తూనే, మరోవైపు  స్పెషల్ సాంగ్స్‌‌  చేస్తూ  వచ్చిన  అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది. తాజాగా టాలీవుడ్‌‌లో  ఆమె మరో రెండు క్రేజీ ఆఫర్స్ దక్కించుకుందని తెలుస్తోంది. నాని హీరోగా సుజీత్ డైరెక్షన్‌‌లో రూపొందనున్న చిత్రంలో హీరోయిన్‌‌గా పూజా హెగ్డేను ఫైనల్ చేశారనే టాక్ వినిపిస్తోంది.

రీసెంట్‌‌గా పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభం కాగా, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వెంకట్ బోయినపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలోనే సెట్స్‌‌కి వెళ్లనుంది. ఇదిలా ఉంటే అల్లు అర్జున్‌‌తో పూజా  మరోసారి స్టెప్స్ వేయడానికి రెడీ అంటోందట. బన్నీ హీరోగా అట్లీ రూపొందిస్తున్న చిత్రంలో పూజా హెగ్డే కూడా భాగమైందనే వార్తలు ఇటీవల బాగా వినిపించాయి. అయితే ఇందులో  ఆమె హీరోయిన్ కాదని, స్పెషల్ సాంగ్ కోసమే తనను తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇప్పటికే  దువ్వాడ జగన్నాథం, అల వైకుంఠపురంలో సినిమాల్లో అల్లు అర్జున్‌‌తో కలిసి నటించించి పూజా. ఆ సక్సెస్‌‌ సెంటిమెంట్‌‌ ఈ సినిమాకు కలిసొస్తుందని టీమ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.