Poonam Kaur: జగన్ విజయానికి కారణం ఆ ముగ్గురే.. నటి పూనమ్ షాకింగ్ కామెంట్స్

Poonam Kaur: జగన్ విజయానికి కారణం ఆ ముగ్గురే.. నటి పూనమ్ షాకింగ్ కామెంట్స్

నటి పూనమ్ కౌర్(Poonam Kaur) మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు టార్గెట్ గా సంచలన కామెంట్స్ చేశారు. 2019లో జగన్(Jagan) విజయానికి కారణం ఆ ముగ్గురే అని, ఇప్పుడు వారు ఆయనతో లేకపోవడంలో ఓడిపోయారు అనే అర్థం వచ్చేలా షాకింగ్ కామెంట్స్ చేశారు పూనమ్. ప్రస్తుతం ఆమె తన సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. 

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఎన్నికల్లోకి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. గత ఎన్నికల్లో 151 సీట్లు గెలుచున్న ఆ పార్టీ ఇప్పుడు కేవడం 11 సీట్లకు మాత్రమే పరిమితమయ్యింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా అందుకోలేనంత ఘోరంగా ఓడిపోయింది వైస్సార్ కాంగ్రెస్ పార్టీ. అయితే ఇదే విషయంపై తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పందించాడు ఆ పార్టీ సపోర్టర్ నటి పూనం కౌర్. గత(2019) ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి విజయంలో ఆయన తల్లి విజయమ్మ భార్య భారతి, సోదరి షర్మిల కీలకపాత్ర పోషించారు. తమదైన శైలిలో జగన్‌కు పట్టుదల, సహనాన్ని నేర్పారు. మళ్లీ ఆ కుటుంబం మొత్తం కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.. అంటూ ట్వీట్‌ చేశారు పూనమ్. దీంతో ఆమె చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.