
తమిళ స్టార్ విజయ్ సేథిపతి(Vijay Sethupathi)కి తెలుగులో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సినిమాలు తెలుగులో కూడా మంచి వసూళ్లను సాధిస్తూ ఉంటాయి. అందుకే వరుసగా ఆయన సినిమాలను తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. తాజాగా ఆయన హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ మహారాజ(maharaja). ఈ సినిమా జూన్ 14న విడుదల కానుంది. ఇందులో భాగంగా హైదరాబాద్ లో మహారాజ మూవీ ప్రెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఇందులో భాగంగా విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ప్రెస్ మీట్ లో భాగంగా ఒక రిపోర్టర్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీ గురించి అడిగాడు. దానికి సమాధానంగా విజయ్ సేతుపతి.. పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆయన కష్టపడేతత్వాన్ని నేను చాలా గౌరవిస్తాను. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి, ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు చాలా మంది ఆయన్ని ట్రోల్స్ చేశారు. కానీ, ఆయన అవన్నీ పట్టించుకోకుండా తొడగొట్టి ముందుకు సాగినప్పుడు రియల్ లైఫ్‌లో కూడా ఆయన మాసో అర్థమైంది.
He is not a hero in somebody's story, He is the hero in his own story.
— Sai Satish (@PROSaiSatish) June 10, 2024
- Makkal Selvan #VijaySethupathi about #PawanKalyan Garu.#Maharaja #MaharajaFromJune14 ⚡️ #PSPK #UstaadBhagatsingh #HHVM #HariHaraVeeramallu #OG #TheyCallHimOG pic.twitter.com/IokeWSSQPH
తన గురించి, ఎవరేమన్నా, ఏం జరిగినా స్థిరంగా ఉండటం అనేది చాలా కష్టం. కానీ, ఆయన నిలబడ్డారు. ఆయన ఎవరి కథలోనో కాదు.. ఆయన కథలో ఆయనే హీరో. అలాంటి చాలా విషయాలను ఎదుర్కొని.. ఫైనల్‌గా ఆయనేంటో చూపించాడు.. అంటూ ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు విజయ్ సేతుపతి. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.