
సోషల్ మీడియాలో ఆకతాయిల అల్లరి రోజురోజుకు ఎక్కువైపోతోంది. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో హీరోయిన్స్పై రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో కొంతమంది వ్యక్తులు తనను టార్గెట్ చేస్తున్నారంటూ నటి రంగ సుధ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎలాపడితే అలా అసభ్యకర పోస్ట్లు పెడుతున్నారంటూ తన కంప్లైంట్లో వివరించింది. అలాగే, కొన్ని ట్విట్టర్ పేజీలతో పాటు రాధాకృష్ణ అనే వ్యక్తిపై ఫిర్యాదు చేసింది.
రాధాకృష్ణ అనే వ్యక్తి తనపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు షేర్ చేస్తున్నాడని ఆమె ఫిర్యాదులో వెల్లడించింది. తాము కలసి ఉన్న సమయంలో తీసిన కొన్ని ప్రైవేట్ వీడియోలు, ఫొటోలు బయట పెడతానని గతంలోనే రాధాకృష్ణ తనను బెదిరించాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది
ఈ క్రమంలో పంజాగుట్ట పోలీసులు కేస్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు షేర్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అయితే, గతంలో రాధాకృష్ణతో నటి రంగ సుధ రిలేషన్‌లో ఉన్నట్లు సమాచారం.
రంగసుధ విషయానికి వస్తే:
నటి రంగసుధ మలయాళంలో 'తెరీ మెరీ' మూవీతో ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సినిమాలో దసరా, దేవర సినిమాల్లో విలన్గా నటించిన 'షైన్ టామ్ చాకో' హీరోగా నటిస్తున్నాడు. త్వరలో రిలీజ్ కానుంది.
అయితే, నటి రంగసుధ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్గా నెటిజన్లకు బాగా పరిచయం. ఈ బ్యూటీకి ఇంస్టాగ్రామ్లో 914K పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు రంగసుధ తన కొత్త ఫోటో షూట్స్తో, వీడియోలతో సోషల్ మీడియాను షేక్ చేసే పనిలో ఉంటుంది.