అక్కినేని హీరో పోస్ట్‌కు సమంత కామెంట్

అక్కినేని హీరో పోస్ట్‌కు సమంత కామెంట్

యశోద సినిమాతో హిట్ కొట్టి.. శాకుంతలం మూవీతో  రెడీ ఉన్న హీరోయిన్ సమంత రీసెంట్ డేస్ లో ఏం చేసినా వైరల్ అవుతోంది. నాగ చైతన్యతో లవ్ మ్యారేజ్, ఆ తర్వాత విడాకుల నుంచి ఈ బ్యూటీ మరింత పాపులర్ అయింది. అయితే చైతో డైవర్స్ తర్వాత కూడా ఆ కుటుంబంలోని హీరోలకు, వారి సినిమాలకు రియాక్ట్ అవడం చూస్తూనే ఉన్నాం. తాజాగా హీరో అక్కినేని అఖిల్ షేర్ చేసిన ఓ పోస్ట్ కు సమంత కామెంట్ చేసింది. అఖిల్ చేసిన ఏజెంట్ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ తన ఇన్ స్ట్రాగ్రామ్ లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియోకు బీస్ట్ మోడ్ ఆన్ అంటూ సమంత కామెంట్ చేసింది. దీంతో ఏజెంట్ వీడియో ఏమో గానీ.. ప్రస్తుతం ఈ అక్కినేని హీరోకు సమంత రిప్లై ఇచ్చిందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.