బుల్లెట్ మీద నుంచి హీరోయిన్ కిందపడిందంటే.. ఇదేదో సినిమా షూటింగులో అనుకుంటే పొరపాటే. ఎందుకంటే నిజంగానే హీరోయిన్ బుల్లెట్ మీద నుంచి కిందపడింది. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంలో రానా సమర్పిస్తున్న సినిమా ‘కృష్ణ అండ్ హిజ్ లీల’. ఈ సినిమాలో సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా.. సీరత్ కపూర్, శాలినీ, శ్రద్ధా శ్రీనాథ్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి రవికాంత్ పేరూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను గురువారం నెట్ ఫ్లిక్స్ లో విడుదలచేశారు.
అయితే ఈ సినిమా షూటింగ్ జూన్ 2017లో హైదరాబాద్ లోని నంది హిల్స్ లో జరుగుతున్నప్పుడు జరిగిన ఓ సంఘటనను శ్రద్ధా తన ఇన్ స్టాగ్రాంలో షేర్ చేసింది. ‘షూటింగ్ లో భాగంగా నేను బైక్ నడిపే సన్నివేశం ఉంది. అందుకోసం డైరక్టర్ రవికాంత్.. నా దగ్గరికి వచ్చి బైక్ నడపగలవా అని అడిగారు. దానికి నేను.. రాదు కానీ.. ట్రై చేస్తా అన్నాను. ఎందుకంటే నాకు 8 ఏళ్ల వయసున్నప్పుడు బైక్ నడిపిన అనుభవం ఉంది. అలా రాయల్ ఎన్ ఫీల్డ్ ఎక్కి టర్న్ చేశానో లేదో.. బ్యాలన్స్ అవుట్ అయి కిందపడిపోయా. ఆ ఘటనను మొత్తం నా అసిస్టెంట్ ప్రశాంత్ సరదాగా వీడియో తీశాడు. నేను కిందపడగానే సెట్ లో ఉన్నవాళ్లంతా తెగ భయపడ్డారు. కానీ, నాకు అంతగా దెబ్బలు తగలకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ రోజు ఆ ప్రాంతమంతా తడిగా ఉంది. అందుకే పడ్డానేమో అనుకుంటున్నా. అయినా రాయల్ ఎన్ ఫీల్డ్ బైకు ఎందుకు అంత బరువుగా ఉంటుందో’ అని ప్రశ్నిస్తూ శ్రద్ధా తన అనుభవాన్ని షేర్ చేసింది.
For More News..