పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను

పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను

హీరోయిన్ శ్రుతి హాసన్ తన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను ఖండించింది. ఈ బ్యూటీ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు ఈ మధ్య సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో శ్రుతి హాసన్ తాజాగా స్పందించింది. " నా ఆరోగ్యంపై వస్తున్నవి అన్ని పుకార్లే అని.. నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను" అని శ్రుతి హాసన్ తెలిపింది. ఈ మేరకు ఓ వీడియో స్టేట్ మెంట్ ను కూడా రిలీజ్ చేసింది.