లాంగ్‌‌ కోటు, క్యాప్‌‌, చేతిలో గన్‌‌.. ఇంటెన్స్‌‌ అవతార్‌‌‌‌ లుక్‎లో అదా శర్మ

లాంగ్‌‌ కోటు, క్యాప్‌‌, చేతిలో గన్‌‌.. ఇంటెన్స్‌‌ అవతార్‌‌‌‌ లుక్‎లో అదా శర్మ

‘ది కేరళ స్టోరీ’ చిత్రం తర్వాత డైరెక్టర్స్‌‌ తనను డిఫరెంట్‌‌ క్యారెక్టర్స్‌‌లో చూపించడానికి ఇష్టపడుతున్నారని చెబుతోంది అదా శర్మ. ఆమె హీరోయిన్‌‌గా నటిస్తున్న కొత్త చిత్రం ‘హాటక్‌‌’. యాక్షన్‌‌ అండ్‌‌ సస్పెన్స్‌‌ కలగలిసిన క్రైమ్ థ్రిల్లర్‌‌‌‌ ఇది. గురువారం ఈ మూవీ ఫస్ట్ లుక్‌‌ను విడుదల చేశారు. ఇందులో ఆమె లాంగ్‌‌ కోటు, క్యాప్‌‌, చేతిలో గన్‌‌తో ఇంటెన్స్‌‌ అవతార్‌‌‌‌లో కనిపించింది. శివరంజని ఆచార్య అనే పాత్రలో ఆమె నటిస్తోంది. తన లుక్‌‌తో పాటు ‘వన్‌‌ హీస్ట్‌‌, నో మెర్సీ’ అనే ట్యాగ్‌‌లైన్‌‌ సినిమాపై మరింత క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. 

యాడ్ ఫిల్మ్ మేకర్‌‌‌‌ ‘అజయ్ కె శర్మ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. 8 పిక్చర్స్‌‌ సంస్థ నిర్మిస్తోంది. రియల్ లైఫ్‌‌ ఇన్సిడెంట్స్‌‌ ఆధారంగా రూపొందుతున్న ఇంటెన్స్‌‌ డ్రామా ఇదిన మేకర్స్‌‌ చెబుతున్నారు. రాజస్థాన్‌‌తో పాటు నార్త్‌‌ ఇండియాలోని పలుప్రాంతాల్లో షూటింగ్‌‌ చేయబోతున్నారు. వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇక ‘హార్ట్‌‌ ఎటాక్‌‌’ చిత్రంతో టాలీవుడ్‌‌కు పరిచయమైన అదా శర్మ.. ఆ తర్వాత సన్నాఫ్‌‌ సత్యమూర్తి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, కల్కి, గరం లాంటి చిత్రాలతో ఆకట్టుకుంది.