కాపర్ బిజినెస్‌లోకి అదానీ ఎంట్రీ

కాపర్ బిజినెస్‌లోకి అదానీ ఎంట్రీ
  • రూ. 6,071 కోట్ల అప్పు ఇవ్వనున్న ప్రభుత్వ బ్యాంకులు

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌‌‌‌ కాపర్ బిజినెస్‌‌లోకి ఎంటర్ అయ్యింది. ఏడాదికి 10 లక్షల టన్నుల కెపాసిటీతో గుజరాత్‌‌లోని ముంద్రా వద్ద ఓ ప్లాంట్‌‌ను ఏర్పాటు చేయబోతోంది. కచ్‌‌ కాపర్ లిమిటెడ్‌‌ పేరుతో ఈ బిజినెస్‌‌ను అదానీ గ్రూప్ ఏర్పాటు చేసింది. కాపర్ ప్లాంట్‌‌ను రెండు ఫేజ్‌‌లలో నిర్మించనున్నారు. మొదటి  ఫేజ్‌‌లో  ఏడాదికి 5 లక్షల టన్నుల కెపాసిటీతో ప్లాంట్‌‌ను ఏర్పాటు చేయనుండగా, తర్వాత ప్లాంట్‌‌ కెపాసిటీని మరో 5  లక్షల టన్నులు పెంచనున్నారు. ఈ గ్రీన్ ఫీల్డ్‌‌ ప్లాంట్‌‌ ఫేజ్ 1 కోసం స్టేట్‌‌ బ్యాంక్‌‌తో పాటు మిగిలిన ప్రభుత్వ బ్యాంకుల కన్సార్టియం రూ. 6,071 కోట్లను అప్పుగా ఇవ్వనుంది. ఈ కన్సార్టియంలో ఎస్‌‌బీఐ, కెనరా బ్యాంక్‌‌, బీఓబీ, ఎగ్జిమ్ బ్యాంక్‌‌, ఇండియన్ బ్యాంక్‌‌, పీఎన్‌బీ, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రాలు ఉన్నాయి.