Goutham Adani : టాప్ 10 బిలియనీర్ల లిస్టు నుంచి అదానీ ఔట్

Goutham Adani : టాప్ 10 బిలియనీర్ల లిస్టు నుంచి అదానీ ఔట్

ఆసియా టాప్ బిలియనీర్ గౌతమ్ అదానీ ప్రపంచ టాప్ 10 బిలియనీర్ల లిస్టులో చోటు కోల్పోయాడు. అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ అదానీ గ్రూప్ కు వ్యతిరేకంగా చేసిన ఆరోపణలు.. కుబేరుల జాబితాలో గౌతమ్ అదానీ స్థానానికి ఎసరు పెట్టింది. ఫలితంగా అదానీ గ్రూప్ షేర్లు మూడు ట్రేడింగ్ సెషన్ల నుంచి భారీగా పతనమవడంతో 34 బిలియన్ డాలర్ల సంపద ఆవిరైపోయింది. ప్రస్తుతం అదానీ 84.4 బిలియన్ డాలర్లతో ప్రపంచ కుబేరుల జాబితాలో 11వ స్థానంలో ఉన్నాడు. 

అదానీ షేర్లు, ఖాతాల్లో అవకతవకలు ఉన్నాయంటూ హిండెన్ బర్గ్ నివేదిక విడుదల చేసింది. రిపోర్టు విడుదల చేయకముందే అదానీ కంపెనీలోని షేర్లను అమ్మి, షేర్ డెరివేటివ్ లు, బాండ్ డెరివేటివ్స్ లో షార్ట్ పొజిషన్లు తీసుకున్నట్టు ప్రకటించింది. దీంతో హిండెన్ బర్గ్ కు లాభాలు చేకూరగా, అదానీ గ్రూప్ కు నష్టాలను మిగిల్చాయి. అయితే హిడెన్ బర్గ్ ఆరోపణల్ని గౌతమ్ అదానీ కొట్టి పారేశారు.