
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌లో అదానీ గ్రూప్ కంపెనీ స్కై స్ట్రైకర్ డ్రోన్లను ప్రయోగించారు. అదానీ గ్రూప్‌కు చెందిన ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్.. ఇజ్రాయెల్ కంపెనీ ఎల్బిట్ సెక్యూరిటీ సిస్టమ్స్‌తో కలిసి ఆ డ్రోన్లను అభివృద్ధి చేసింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో లక్ష్యాలను స్కై స్ట్రైకర్ డ్రోన్లు అత్యంత కచ్చితత్వంతో ఛేదించాయని అధికారులు తెలిపారు. మానవరహిత ఎయిర్ క్రాఫ్ట్, మిసైల్స్ లాగే ఈ డ్రోన్లు కూడా లక్ష్యాలను ఛేదిస్తాయని చెప్పారు. టార్గెట్ ఏరియాలో కొద్ది ఎత్తులో ఎగురుతూ లక్ష్యాలను గుర్తిస్తాయని, ఆటోమేటిక్‌గా లేదా మానవ నియంత్రణతో టార్గెట్‌పై దాడి చేస్తాయని వివరించారు. తక్కువ ఎత్తులో ఎగురుతూ శత్రువుకు చిక్కవని పేర్కొన్నారు.