న్యూఢిల్లీ: అదానీ పవర్ 2032 ఆర్థిక సంవత్సరం నాటికి తన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 41.87 గిగావాట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం సుమారు రూ.రెండు లక్షల కోట్ల పెట్టుబడి పెట్టనుంది.
ముఖ్యంగా థర్మల్ విద్యుత్ సామర్థ్యం పెంచడంపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం సంస్థకు 18.15 గిగావాట్ల సామర్థ్యం ఉండగా, అదనంగా 23.72 గిగావాట్ల విస్తరణ పనులు వేగవంతం చేసింది.
ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, అస్సాం రాష్ట్రాల్లో భారీ ప్రాజెక్టులు చేపట్టింది. భూటాన్ వాంగ్‌చు ప్రాజెక్టుతో జల విద్యుత్ రంగంలోకి ప్రవేశించింది. మధ్యప్రదేశ్‌లోని ధిరౌలి బొగ్గు గనిని త్వరలో ప్రారంభిస్తామని అదానీ పవర్ ప్రకటించింది.
