అదానీ కంపెనీ రికార్డ్... గ్రీన్ పవర్‌‌‌‌‌‌‌‌తో నడుస్తున్న ధామ్రా పోర్ట్

అదానీ కంపెనీ రికార్డ్... గ్రీన్ పవర్‌‌‌‌‌‌‌‌తో నడుస్తున్న ధామ్రా పోర్ట్

న్యూఢిల్లీ: అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఏపీసెజ్‌‌‌‌‌‌‌‌) ఆధ్వర్యంలోని ఒడిశాలోని ధామ్రా పోర్టు పూర్తిగా రెన్యూవబుల్  కరెంట్‌‌‌‌‌‌‌‌తో  నడుస్తోంది.  దీంతో 100శాతం గ్రీన్ పవర్‌‌‌‌‌‌‌‌తో నడిచే భారతదేశపు మొట్టమొదటి భారీ మల్టీ-కార్గో ప్రైవేట్ పోర్టుగా నిలిచింది. ఏడాదికి 4.88 కోట్ల టన్నుల సరుకు రవాణా సామర్థ్యం కలిగిన ఈ పోర్టు, నెలకు అవసరమయ్యే 90 లక్షల యూనిట్ల కరెంట్‌‌‌‌‌‌‌‌ను (ఏడాదికి 108 గిగావాట్‌‌‌‌‌‌‌‌అవర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంటే ఎక్కువ) గ్రీన్ ఎనర్జీ నుంచే పొందుతోంది. 

గుజరాత్‌‌‌‌‌‌‌‌లోని ఖవ్డాలో ఉన్న అదానీ హైబ్రిడ్ పవర్ ప్లాంట్ నుంచి 25-–30శాతం,  థర్డ్ పార్టీ ద్వారా 10–15శాతం, మిగిలిన భాగాన్ని ఒడిశా పవర్ యుటిలిటీ 'గ్రీన్ కన్స్యూమర్' నిబంధనల ద్వారా సమకూర్చుకుంటోంది.  సరుకుల లోడింగ్, అన్‌‌‌‌‌‌‌‌లోడింగ్, స్టోరేజ్, రైల్వే నెట్‌‌‌‌‌‌‌‌వర్క్ సహా పోర్టుకు సంబంధించిన పనులన్నీ  రెన్యూవబుల్ కరెంట్‌‌‌‌‌‌‌‌తోనే నడుస్తున్నాయని 
అదానీ పోర్ట్స్ పేర్కొంది.