ఏడేళ్లలో టీఆర్ఎస్ దళితులకు ఏం చేసిందో చెప్పాలి

V6 Velugu Posted on Jan 21, 2022

కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలు  దళిత వ్యతిరేక  విధానాలతో ముందుకెళ్తున్నాయని  ఆరోపించారు  పీసీసీ అధికార  ప్రతినిధి అద్దంకి దయాకర్.  టీఆర్ఎస్,  బీజేపీలకు   ఎస్సీ, ఎస్టీల  ఓట్లు అడిగే  నైతిక హక్కు లేదన్నారు.  ఈ ఏడేళ్లలో   టీఆర్ఎస్ ప్రభుత్వం  ఎస్సీ, ఎస్టీలకు ఏం  చేసిందో   చెప్పాలన్నారు. దళిత బంధు  అని చెప్పి  80 రోజులు అవుతున్నా  ఇప్పటి వరకు  పట్టించుకోవడం  లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.   బీజేపీ దళిత  పక్షపాతి అంటే... దయ్యాలు వేదాలు వల్లించినట్లు  ఉందన్నారు అద్దంకి దయాకర్.

 

Tagged TRS, central govt, addanki dayakar, Dalits Assurance

Latest Videos

Subscribe Now

More News