అప్లికేషన్లను అప్​లోడ్​ చేయాలి : కలెక్టర్ మయాంక్  మిత్తల్

అప్లికేషన్లను అప్​లోడ్​ చేయాలి : కలెక్టర్ మయాంక్  మిత్తల్

నారాయణపేట, వెలుగు :  ప్రజా పాలనలో భాగంగా వచ్చే దరఖాస్తులను వెంటనే అప్​లోడ్  చేయాలని అడిషనల్​ కలెక్టర్ మయాంక్  మిత్తల్  సూచించారు. శుక్రవారం నారాయణపేట మున్సిపల్  ఆఫీస్​ను ఆయన తనిఖీ చేశారు. ప్రజా పాలనలో  వచ్చిన దరఖాస్తుల అప్ లోడ్ ను పర్యవేక్షించారు.

వచ్చిన దరఖాస్తులను వెంటనే ఆన్​లైన్ లో నమోదు చేయాలన్నారు. అనంతరం మున్సిపల్  ఆఫీస్​ ఆవరణలో కొనసాగుతున్న షీ టాయిలెట్  బ్లాక్, మీటింగ్  హాల్  నిర్మాణ పనులను పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేయించాలని మున్సిపల్  కమిషనర్  సునీతకు సూచించారు.