
ఐపీఎల్ సందడి మొదలైంది. ఏప్రిల్ 2న మధ్యాహ్నం 3.30గంటలకు ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక అభిమానులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అదనంగా మెట్రో రైళ్లను నడపనున్నట్లుగా మెట్రో ప్రకటించింది.
రద్దీ దృష్ట్యా నాగోల్-అమీర్‌పేట మార్గంలో ఎక్కువ సంఖ్యలో రైళ్లను నడపనున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి అధిక సంఖ్యలో మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. అలాగే నగర శివార్ల నుంచి ఉప్పల్ కు స్పెషల్ బస్సులను నడపనున్నట్లుగా ఆర్టీసీ తెలిపింది. కాగా మొత్తం ఉప్పల్ స్టేడియంలో ఏడు మ్యాచ్‌లు జరగనున్నాయి.