ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ వరల్డ్ క్రికెట్ లో ఎలాంటి ముద్ర వేశాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా టీ 20 క్రికెట్ లో వార్నర్ మ్యాచ్ విన్నర్. ఓపెనర్ గా బరిలోకి దిగి భారీ ఇన్నింగ్స్ లు ఆడడంలో ఈ ఆసీస్ మాజీ ఓపెనర్ దిట్ట. ఐపీఎల్ లో రెండు సార్లు ఆరెంజ్ క్యాప్ గెలుచుకోవడమే కాకుండా ఈ మెగా టోర్నీలో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్ గా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్ కు ఎప్పుడైతే డేవిడ్ రిటైర్మెంట్ ప్రకటించాడో అప్పటి నుంచి ఫామ్ తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలోలోని బిగ్ బాష్ లీగ్ ఆడుతూ తన క్రికెట్ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు.
వార్నర్ ఎంతటి ప్రమాదకర బ్యాటర్ అయినప్పటికీ ప్రస్తుతం ఆ రేంజ్ లో ఆడలేకపోతున్నాడు. బిగ్ బాష్ లీగ్ లో వేగంగా పరుగులు చేయడంలో తడబడుతున్నాడు. సిడ్నీ థండర్ తరపున ఆడుతున్న వార్నర్ మంగళవారం (జనవరి 6) అడిలైడ్ స్ట్రైకర్స్ తో జరిగిన మ్యాచ్ లో తమ జట్టును గెలిపించడంలో విఫలమయ్యాడు. థండర్ విజయానికి చివరి ఓవర్లో 13 పరుగులు అవసరం అయ్యాయి. వార్నర్ చివరి వరకు క్రీజ్ లో ఉండి జట్టు ఆశలను సజీవంగా ఉంచాడు. వార్నర్ క్రీజ్ లో ఉండడంతో ఫ్యాన్స్ థండర్ విజయం ఖాయమనుకున్నారు. అయితే అనుకున్నది ఏమీ జరగలేదు. స్ట్రైకర్స్ బౌలర్ ల్యూక్ వుడ్ ధాటికి పరుగులు చేయలేకపోయాడు.
తొలి మూడు బంతుల్లో వార్నర్ కనీసం సింగిల్ తీయలేకపోయాడు. మూడు డాట్ బాల్స్ కావడంతో చివరి మూడు బంతులకు 12 పరుగులు చేయాల్సిన పరిస్థితి. నాలుగో బంతికి సింగిల్ తీశాడు. దీంతో సమీకరణం 2 బంతుల్లో 12 పరుగులకు చేరింది. నాన్ స్ట్రైకర్ లో ఉన్న మెక్ డోనాల్డ్ సిక్సర్ కొట్టడంలో విఫలం కావడంతో మ్యాచ్ అడిలైడ్ గెలిచింది. చివరి బంతికి సింగిల్ రావడంతో ఈ మ్యాచ్ లో అడిలైడ్ స్ట్రైకర్స్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. వార్నర్ 51 బంతుల్లో 67 పరుగులు చేసి అజేయంగా నిలిచినప్పటికీ పరాజయం తప్పలేదు.
అప్పటివరకు జట్టుకు హీరోలా చివరి వరకు నిలబడిన వార్నర్.. చివర్లో బ్యాట్ ఝులిపించలేక మ్యాచ్ ఓటమికి కారణమయ్యాడు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రైకర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఛేజింగ్ లో థండర్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులకే పరిమితమైంది.
13 runs. 6 balls.
— KFC Big Bash League (@BBL) January 6, 2026
Luke Wood to David Warner. #BBL15 pic.twitter.com/0hgpCU5GMo
