V6 News

ఉపాధి హామీ పనులను పర్యవేక్షించాలి : ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా

ఉపాధి హామీ పనులను పర్యవేక్షించాలి : ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా
  •     కలెక్టర్ ​రాజర్షి షా

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వత ఆస్తుల కల్పన చేపట్టాలని, పనుల నిర్వహణలో రాజీ పడకుండా ఇంజనీరింగ్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదిలాబాద్​కలెక్టర్​రాజర్షి షా ఆదేశించారు. తాంసి మండలం పొన్నారి శివారులో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పూడికతీత పనులను గురువారం పరిశీలించారు. 

మస్టర్ రోల్స్‌‌‌‌‌‌‌‌ను తనిఖీ చేశారు. పనుల్లో నాణ్యత పాటించాలని, కూలీలు చేసిన పనికి తగిన వేతనం అందేలా కొలతలు కచ్చితంగా ఉండాలని ఆదేశించారు. ఎండ తీవ్రత పెరుగుతున్నందున కూలీలు అస్వస్థతకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డీఆర్డీవో రవీందర్, ఎంపీడీవో మోహన్ రెడ్డి, తహసీల్దార్ లక్ష్మి, సర్పంచ్ భీమన్న, ఏపీవో విజయ తదితరులు పాల్గొన్నారు.