- ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్, వెలుగు: జనగణనలో భాగంగా మే 10 వరకు సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకునే అవకాశం ఉందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో తొలి దశ జనగణన, ఇండ్ల గణనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మే 11 నుంచి జూన్ 9 వరకు ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. అంతకుముందే సెల్ఫ్ ఎన్యుమరేషన్ కోసం ఆన్లైన్ లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. జన గణనకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.
ప్రజలంతా జన గణనలో పాల్గొని సమగ్ర సమాచారాన్ని అందించాలని కోరారు. స్వీయ నమోదు చేసుకున్న కుటుంబాలు మే 11 తర్వాత ఇంటికి వచ్చే ఎన్యుమరేటర్లకు ఐడీ చూపిస్తే సరిపోతుందని, దీంతో గణన ప్రక్రియ వేగవంతం అవుతుందని తెలిపారు. ఎస్పీ అఖిల్ మహాజన్, అడిషనల్ కలెక్టర్లు రాజేశ్వర్, చిత్రు, మున్సిపల్ కమిషనర్ రాజు, సెన్సెస్ ఆఫీసర్లు కృష్ణయ్య, నలంద ప్రియ పాల్గొన్నారు.

