ఆదిలాబాద్టౌన్/బెల్లంపల్లి, వెలుగు: మున్సిపల్ఎన్నికల నామినేషన్లు ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో అభ్యర్థులకు గుర్తుల కేటాయింపును నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదిలాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. మంగళవారం పట్టణంలోని టీటీడీసీలో రిటర్నింగ్ అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా ఎన్నికల నియమావళి ప్రకారం పారదర్శకంగా వ్యవహరించాలని ఆదేశించారు.
సమావేశంలో అడిషనల్కలెక్టర్ రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ రాజు, నోడల్ అధికారి ఫణీందర్, మాస్టర్ ట్రైనర్ లక్ష్మణ్, రిటర్నింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఎన్నికల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి
మున్సిపల్ఎన్నికల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ఆదేశించారు. మంగళవారం బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. నిబంధనల ప్రకారం పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితా ప్రకటించాలన్నారు.
ఎన్నికల ప్రక్రియ పూర్తిగా వీడియోగ్రఫీ చేస్తామన్నారు. అనంతరం పట్టణంలోని బజార్ ఏరియాలో ఉన్న జడ్పీహెచ్లో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రం, ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. రామ్ నగర్ ప్రాంతంలో నిర్మిస్తున్న ఎంపీపీఎస్ నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట మున్సిపల్కమిషనర్ జె. సంపత్, సిబ్బంది ఉన్నారు.
