ఆదిలాబాద్ లో 17 ఏళ్లకు దొరికిన నిందితుడు

ఆదిలాబాద్ లో 17 ఏళ్లకు దొరికిన నిందితుడు

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టి17 ఏళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న నిందితుడిని సోమవారం ఆదిలాబాద్​ వన్​టౌన్​పోలీసులు అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. సీఐ బి.సునీల్​కుమార్ వివరాల ప్రకారం..ఆదిలాబాద్ పట్టణంలో 2009 సంవత్సరంలో వెంగళ్ల రమేశ్​బాబు అనే వ్యక్తి వీఆర్ ఎక్విప్‌‌‌‌‌‌‌‌మెంట్ అండ్ కన్స్యూమర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నిర్వహించిన సంస్థ ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి పలువురు నిరుద్యోగులను నమ్మించాడు. 

ఒక్కొక్కరి నుంచి రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు వసూలు చేసి మోసానికి పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదు మేరకు అప్పట్లో కేసు నమోదు కాగా.. నిందితుడు 17 సంవత్సరాలుగా కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. అతడిపై కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో పోలీసులు పట్టుకొని కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ పేర్కొన్నారు.