ఆదిలాబాద్‌‌లో కాంగ్రెస్‌‌కు షాక్

 ఆదిలాబాద్‌‌లో కాంగ్రెస్‌‌కు షాక్

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ కాంగ్రెస్‌‌కు మైనారిటీలు షాక్ ఇచ్చారు. ఎన్నో ఏండ్లుగా పనిచేస్తున్న లీడర్లను కాదని కొత్తగా వచ్చిన కంది శ్రీనివాస్ రెడ్డికి టికెట్ ఇచ్చినందుకు నిరసగా తాము పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మైనార్టీ సెల్ జిల్లా చైర్మన్ షేక్‌‌ కలీం సహా పలువురు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆదివారం వారు మీడియాతో మాట్లాడుతూ, ఆదిలాబాద్ నియోజకవర్గ టికెట్‌‌ను ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తికి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. 

డీసీసీ చైర్మన్ సాజిద్ ఖాన్, పీసీపీ ప్రధాన కార్యదర్శి సుజాత, సంజీవ్ రెడ్డి లాంటి సీనియర్లకు టికెట్ ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టారు. 20 ఏండ్ల నుంచి పార్టీ కోసం పనిచేసిన లీడర్లకు టికెట్ ఇవ్వకుండా కొత్త వారికి ఇవ్వడంతోనే తాము రాజీనామా చేశామని తెలిపారు. పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసి వారికి టికెట్ ఇవ్వకపోవడం 
సిగ్గుచేటన్నారు.