లీకైన ఆదిపురుష్ HD వెర్షన్.. షాకైన మేకర్స్

లీకైన ఆదిపురుష్ HD వెర్షన్.. షాకైన మేకర్స్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) రాముడిగా చేసిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్(Adipurush). బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్(Om Raut) దర్శకత్వంలో.. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు.. మొదటి షో నుండే నెగిటీవ్ టాక్ వచ్చింది. రామాయణ గాధ ఆధారంగా వచ్చిన ఈ సినిమాలో.. సంభాషణలు, సన్నివేశాల మార్పు, పాత్రల చిత్రీకరణపై దేశవ్యాప్తంగా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.

దీంతో సినిమాను బ్యాన్ చేయాలంటూ కోర్టులో పిటీషన్స్ కూడా దాఖలు అయ్యాయి. ఈ ప్రభావం సినిమా కలెక్షన్స్ పై పడింది. దాదాపు రూ.650 కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా.. కనీసం అందులో సగం కూడా కలెక్ట్ చేయలేకపోయింది. సినిమాను నమ్ముకున్న డిస్ట్రిబ్యూటర్స్ తీవ్రంగా నష్టపోయారు.

కనీసం ఓటీటీలో ఐనా మంచి రిజల్ట్ ఉంటుందేమో అని ఆశించిన మేకర్స్ కు.. ఆ సంతోషం కూడా లేకుండా పోయింది. ఆదిపురుష్ మూవీ ఇంకా ఓటీటీలో రిలీజ్ అవలేదు కానీ.. ఈ సినిమా HD వెర్షన్ ఆన్లైన్లో లీకైంది. ఈ న్యూస్ ఆదిపురుష్ మేకర్స్ ను అవాక్కయ్యేలా చేసింది. దీంతో ఈ సినిమాను ఆన్లైన్ నుండి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. అయితే ఇప్పటికే చాలామంది ఈ మూవీని డౌన్లోడ్ చేసుకున్నారని సమాచారం. ఓటీటీ రిలీజ్ అప్పటికే ఈ సినిమాను అందరూ చూసేసుంటారు. దీంతో ఆదిపురుష్ ఓటీటీలో కూడా  సేమ్ రిజల్ట్ అందుకోనుందా అనే కామెంట్స్ వస్తున్నాయి.