ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం భారీ ఖర్చు.. ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే

ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం భారీ ఖర్చు.. ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) ప్రధాన పాత్రలో వస్తున్న ఆదిపురుష్(Adipurush) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం భారీగా ఖర్చు చేస్తున్నారట మేకర్స్. ప్రస్తతం ఇండియా వైడ్ గా ఎక్కడ చూసినా ఈ టాపిక్ గురించే డిస్కషన్ నడుస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ 6న తిరుపతిలో గ్రాండ్ గా జరుగనున్న విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ చీఫ్ గెస్ట్ గా ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చిన్న జీయర్ స్వామీ(Chinna Jeeyar Swamy) హాజరుకానున్నారు.

ఇక తాజాగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి మరో న్యూస్ సోషల్ మీడియాలో ట్రేండింగ్ అవుతోంది. అదేంటంటే.. ఈ ఈవెంట్ కోసం మేకర్స్ దాదాపు రూ. 2.5 కోట్లు ఖర్చుపెడుతున్నారట. అంతేకాదు కేవలం క్రాకర్స్(ఫైర్ వర్క్) కోసమే 50 లక్షలు ఖర్చు చేస్తున్నారని సమాచారం. అయితే ఇప్పటివరకు జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో ఇదే హైయెస్ట్ కావడం విశేషం. ఈ విషయం తెల్సుకున్న ఇండస్ట్రీ వర్గాలు షాకవుతున్నాయట. కేవలం ప్రీ రిలీజ్ కోసం ఇంత ఖర్చు చేయడం ఏంటని అవాక్కవుతున్నారట. 

రామాయణ గాధ ఆధారంగా వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్(Kriti Sanon) సీతగా కనిపించనున్నారు. ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ ఐన పోస్టర్స్, సాంగ్స్,ట్రైలర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. ఇక ఇప్పుడు భారీ ఎత్తున జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ఆ అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకోవడం ఖాయం అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. దాదాపు రూ. 600 కోట్ల బడ్జెట్ తో రానున్న ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్(Om Raut) తెరకెక్కిస్తుండగా.. జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.