"ఆదిపురుష్"కు వ్యతిరేకంగా పిల్.. పబ్లిక్ ప్రదర్శనకు సరికాదని ఆరోపణ

"ఆదిపురుష్"కు వ్యతిరేకంగా పిల్.. పబ్లిక్ ప్రదర్శనకు సరికాదని ఆరోపణ

రెబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ ఫిల్మ్ 'ఆదిపురుష్' జూన్ 16న విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాకు మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. కొందరు ఈ మూవీ చాలా బాగుందని కితాబిస్తుండగా.. మరికొందరేమో తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అందులో భాగంగా 'ఆదిపురుష్'కు వ్యతిరేకంగా హిందూసేన ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. ఈ చిత్రం హిందువుల మనోభావాలు తీసేలా ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు. శ్రీరాముడిని, హిందూ సంప్రదాయాల్ని ఎగతాళి చేసేలా ఉందని ఆరోపించారు. సినిమాలో ప్రధాన పాత్రలను చూపించిన తీరు సరికాదన్న హిందూసేన.. రామాయణంలోని పాత్రలకు, ఆదిపురుష్ లోని పాత్రలకు ఏ మాత్రం పోలిక లేదని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ సినిమాలో రాముడు, సీత, రావణుడు, హనుమంతుడికి సంబంధించిన కొన్ని అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని, లేదా వాటిని సరిదిద్ది నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేయాలని హిందూసేన పిటిషన్ లో పేర్కొంది. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా, ఆత్రుతగా ఎదురుచూస్తోన్న ఆదిపురుష్ విడుదలతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటించారు. కాగా ఈ మూవీకి ఓం రౌత్ దర్శకత్వం వహించారు.