Aditi Rao Hydari, Siddharth: టిమ్‌కుక్‌తో సిద్దార్థ్, అదితి ముచ్చట్లు..యాపిల్‌ ఈవెంట్‌లో సందడి చేసిన జంట

Aditi Rao Hydari, Siddharth: టిమ్‌కుక్‌తో సిద్దార్థ్, అదితి ముచ్చట్లు..యాపిల్‌ ఈవెంట్‌లో సందడి చేసిన జంట

యుఎస్‌ఎలో ఐఫోన్ 16 లాంచ్ ఈవెంట్‌లో హీరో సిద్ధార్థ్‌(Siddharth-), అదితిల (Aditi Rao Hydari) జంట సందడి చేసింది. యాపిల్ CEO టిమ్‌కుక్‌తో కలిసి వీళ్లిద్దరూ ఫొటో దిగారు. తాజాగా ఈ జంట తమ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆపిల్ CEO టిమ్ కుక్‌తో దిగిన కొత్త ఫోటోలను పంచుకున్నారు.వివరాల్లోకి వెళితే.. 
 
ప్రముఖ టెక్‌ సంస్థ యాపిల్ (Apple) ఇట్స్‌ ‘గ్లోటైమ్‌’ పేరిట అమెరికా కాలిఫోర్నియాలో ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో బాలీవుడ్‌, కోలీవుడ్‌ స్టార్స్‌ తళుక్కున మెరిశారు. ఈ నేపథ్యంలో హీరో సిద్ధార్థ్‌ (Siddharth) తనకు కాబోయే భార్య అదితితో కలిసి వెళ్లారు. యాపిల్ కంపెనీకి చెందిన స్టీవ్ జాబ్స్ థియేటర్ కి వెళ్లి ఐ ఫోన్ 16ని కొనుగోలు చేసారు. అంతేకాకుండా యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ని కలిసి అతనితో కాసేపు ముచ్చటించారు.

టిమ్ కుక్ తో దిగిన ఫొటోలు తమ సోషల్ మీడియాలో షేర్ చేసి..తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, ఇది 'మరపురాని మరియు మాయా' అనుభవం అని అదితి ఇంస్టాగ్రామ్ లో పేర్కొంది. అత్యంత మధురమైన మరియు దయగల వ్యక్తిగా ఉన్నందుకు టిమ్ కుక్‌కు ఆమె ధన్యవాదాలు తెలిపింది. ఐఫోన్ లాంచ్‌కు హాజరైన ఈ జంట అక్కడే రెండు రోజులు గడిపారు.

ALSO READ | The GOAT : ‘ది గోట్‌' నెగిటివ్ రివ్యూలపై..స్పందించిన డైరెక్టర్ వెంకట్‌ ప్రభు

అలాగే "ఈ రోజును ఎప్పటికీ మర్చిపోము. ఈ ఈవెంట్‌లో మేమెంతో ఎంజాయ్‌ చేశాం. అత్యంత పెద్ద సాంకేతిక ప్రపంచంలో రెండు రోజులు గడిపాం. కానీ అన్నిటికంటే చాలా ప్రత్యేకమైనది Apple పర్యావరణ వ్యవస్థను తయారు చేసే వ్యక్తులను కలవడం మా మనసుల్ని హత్తుకుంది. వాళ్ల ప్రతిభ, ఆవిష్కరణలకు చూసి మేము ఆశ్చర్యపోయాం. అలాంటి వ్యక్తులను కలవడంతో మా హృదయాలు ఆనందంతో నిండిపోయాయి. ముఖ్యంగా యాపిల్‌ సీఈఓ (CEO) టిమ్ కుక్‌ ఎంతో వినయంగా పలకరించారు. ఆయనకు మా ప్రత్యేక ధన్యవాదాలు’ అంటూ టిమ్‌కుక్‌తో దిగిన ఫొటోలను పంచుకుని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

సిద్ధార్థ్, అదితి రావ్ హైదరీ ఈ సంవత్సరం ప్రారంభంలో..వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని 400 ఏళ్ల పురాతన రంగనాథస్వామి దేవాలయంలో నిశ్చితార్థం చేసుకున్నారు. పెళ్లి కూడా అక్కడే ఉంటుందని ఈ జంట ఇదివరకే వెల్లడించింది. 

ఇకపోతే ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం విశేషం. సుధీర్ బాబు నటించిన సమ్మోహనం సినిమాతో అదితి తెలుగు ఇండస్ట్రికి పరిచయం అయ్యారు. ప్రస్తుతం వీరిద్దరూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.