సూర్య 43వ మూవీలో.. స్టార్​ డైరెక్టర్​ శంకర్ డాటర్

సూర్య 43వ మూవీలో.. స్టార్​ డైరెక్టర్​ శంకర్ డాటర్

ప్రస్తుతం కోలీవుడ్​లో అదితి శంకర్(Adithi Shankar) ​హవా నడుస్తోంది. ఇటీవల శివకార్తికేయన్​తో ఆమె నటించిన మహావీరుడు మంచి హిట్టందుకుంది. స్టార్​ డైరెక్టర్​ శంకర్​ కుమార్తెగా ఈ బ్యూటీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. 

లేటెస్ట్ గా తమిళ స్టార్ హీరో సూర్య 43వ మూవీలో హీరోయిన్ గా సెలెక్ట్ అయిన్నట్టు సమాచారం. ఈ మూవీని నేషనల్ అవార్డు విన్నర్ సుధా కొంగర డైరెక్ట్ చేయబోతున్నారు. సూర్య 43 టైటిల్‌గా వస్తోన్నఈ ప్రాజెక్ట్ లో దుల్కర్ సల్మాన్ కీ రోల్ ప్లే చేస్తున్నట్లు సమాచారం.

ఈ మూవీ కోసం కోలీవుడ్ స్టార్ మ్యూజిక్  డైరెక్టర్ జీవి ప్రకాష్ అద్దిరిపోయే ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ మూవీ జీవి ప్రకాష్ కు 100వ మూవీ కావడంతో స్పెషల్ ట్యూన్స్ కంపొజిషన్ లో ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. ఇంతకు ముంది తమిళ హీరో కార్తీ తో వీరుమాన్.. తెలుగు వీరబాబు గా వచ్చిన మూవీలో హీరోయిన్ గా నటించింది. ఇక ఇప్పుడు అన్నయ్య సూర్యతో నటిస్తుండటంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. 

అదితి భవాని శంకర్ గత చిత్రం మహావీరుడు మూవీని డైరెక్ట్ చేసిన మడోన్ అశ్విన్‌‌‌‌ కూడా నేషనల్ అవార్డు విన్నర్ అవ్వడం విశేషం.వరుస ఆఫర్స్ తో దూసుకెళ్తున్న అదితి..ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో లక్కీ చార్మ్ గా పిలుస్తున్నారు.  

అలాగే ఒకప్పటి యూత్​ సెన్సేషనల్​ సినిమా 7G బృందావన్​ కాలనీ రీమేక్​లో అదితి పేరు వినిపిస్తోంది. అదితి మెడిసిన్ చదివి, యాక్టింగ్ కెరీర్ ఎంచుకుని, తన డిసిప్లిన్‌‌‌‌, టాలెంట్‌‌‌‌తో వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటుంది.