చనిపోతాం అని తెలిసీ.. ఎంత ఆనందంగా ఉన్నారు : అడవి శేషు ఎమోషనల్

చనిపోతాం అని తెలిసీ.. ఎంత ఆనందంగా ఉన్నారు : అడవి శేషు ఎమోషనల్

హీరో అడవిశేష్ (Adivi Sesh)..తనదైన సినిమాలతో నటిస్తూ బిజీగా ఉన్నారు. రైటర్, డైరెక్టర్,యాక్టర్ గా మంచి గుర్తింపు పొందారు.అమెరికాలో తన విద్యాభ్యాసం ముగించుకుని..టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. అందులో భాగంగా..2002 లో విడుదలైన సొంతం సినిమాలో.. ఒక అతిథి పాత్రతో సినిమా కెరీర్ మొదలైంది. ప్రస్తుతం శేష్ బిజీయెస్ట్ స్టార్గా ఎదిగి..టాలీవుడ్ స్టార్స్..సూపర్ స్టార్స్ చేత శభాష్ అనిపించుకున్నారు.

లేటెస్ట్ గా అడవి శేష్ క్యాన్సర్‌తో పోరాడుతున్న పిల్లలతో సరదాగా గడిపే ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలల వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సెయింట్ జూడ్ అనే సంస్థను శేష్ సందర్శించారు. అక్కడ ఆ పిల్లలతో కలిసి వేడుకలు జరుపుకోవడంతో పాటు..కేక్, బెలూన్ల మధ్యన.. నవ్వుతూ..సరదాగా డ్యాన్స్ చేశారు.

'ఈ పిల్లలందరితో కలిసి గడపటం..నా జీవితంలో అత్యంత అందమైన జ్ఞాపకాలలో ఒకటి. వారు క్యాన్సర్‌తో పోరాడుతున్న..ఇంత హ్యాపీ గా ఉంటున్నారు అంటే..చాలా గొప్ప విషయం..పిల్లలు నాకు చాలా హోప్స్ ఇచ్చారని ఇన్స్టా పోస్ట్లో తెలిపారు. దీంతో అడవి శేష్ చూపిస్తున్న ఆదరణ పట్ల సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు  

2010 లో రిలీజైన కర్మ అనే మూవీతో రైటర్, డైరెక్టర్ గా మారి ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పంజా మూవీలో విలన్ గా చేసి గుర్తింపు పొందారు. ఇక క్షణం మూవీతో హీరోగా మారి.. ఎవరు,గూఢచారి,మేజర్, హిట్ 2 మూవీస్ తో సత్తా చాటారు. ప్రస్తుతం గూఢచారి 2 మూవీలో నటిస్తున్నాడు.  

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sesh Adivi (@adivisesh)