రాహిల్​ బెయిల్​ రద్దు పిటిషన్ పై తీర్పు వాయిదా

రాహిల్​ బెయిల్​ రద్దు పిటిషన్ పై తీర్పు వాయిదా

హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ హిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసులో నిందితుడిగా ఉన్న బోధన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొడుకు రాహిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెయిల్​రద్దు పిటిషన్​పై తీర్పును హైకోర్టు వాయిదా వేసింది. రాహిల్​ను అరెస్టు చేయరాదంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను హైకోర్టు సోమవారం విచారించింది. జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బి.విజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్డు ప్రమాదం కేసులో ఓ చిన్నారి మరణించింది. కారు ప్రమాదానికి కారణమైన ముగ్గురు పారిపోయారు. 

కారుపై ఎమ్మెల్యే షకీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టిక్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంది. ఈ ప్రమాదానికి తానే కారణమంటూ గతంలో ఓ వ్యక్తి లొంగిపోయాడు. ఈ కేసులో తనపై కఠిన చర్యలు తీసుకోరాదంటూ రాహిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైకోర్టును ఆశ్రయించి మధ్యంతర బెయిలు పొందారు. ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని పోలీసులు మధ్యంతర పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాఖలు చేశారు. పోలీసుల ముందు మరో వ్యక్తి లొంగిపోయేలా చేసి రాహిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తప్పించుకున్నారని పోలీసులు వాదిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల పంజాగుట్టలో జరిగిన రోడ్డు ప్రమాదం కేసు విచారణను రాహిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎదుర్కొంటున్నారు.