కలెక్టర్, ఎస్పీలు అందరి ఎదుటే..దేవుడి పాట పాడుతూ .. అదనపు జిల్లా మేజిస్ట్రేట్ మృతి

కలెక్టర్, ఎస్పీలు అందరి ఎదుటే..దేవుడి పాట పాడుతూ .. అదనపు జిల్లా మేజిస్ట్రేట్ మృతి

మరణం అనేది ఎప్పుడు వస్తుందో ఎవరకి తెలియదు. మానువులుగా మనం ఎంత అభివృద్ధి సాధించినా టెక్నాలజీ పరంగా ఎంత ఎత్తుకు ఎదిగినా.. రుజువు చేయా ల్సిన అవసరం లేనిదేదైనా ఉందంటే అది మరణమే.. ఇటీవల కాలంలో వృద్ధాప్యం మీద పడి మృతిచెందడం కంటే ప్రమాదాలు, ఆకస్మిక అనారోగ్య కారణాలతో ఎక్కువగా చనిపోతున్న ఘటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.  అప్పటి వరకు సంతోషంగా స్టెప్పులేస్టూ చనిపోయినవారు కొందరుంటే.. ఆటలు ఆడుతూ , పాటలు పాడుతూ ప్రాణాలు ఒదిలివారు ఇంకొందరు.. సరిగ్గా అలాంటి ఘటనే ఒకటి తాజాగా ఒడిశాలో జరిగింది వివరాల్లోకి వెళితే.. 

ఒడిశాలో ఓ భజన కార్యక్రమంలో దేవుని పాట పాడుతూ ప్రాణాలు ఒదిలాడు ఓ ప్రభుత్వ ఉద్యోగి.. ఒడిశాలోని గజపతి జిల్లాలో ప్రభుత్వ అధికారులంతా ఓ భజన కార్య క్రమాన్ని ఏర్పాటు చేశారు. అందు లో పూరి జగన్నాథుని భజన పాట పాడుతూ కుప్పకూలిపోయాడు అదనపు జిల్లా మేజిస్ట్రేట్. వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేదు.. మేజిస్ట్రేట్ గుండెపోటుతో మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. 

మృతుడు బీరేంద్ర కుమార్ దాస్ గజపతి జిల్లాలో రెవెన్యూ డిపార్టుమెంట్ లో ఏడీఎం  గా పనిచేస్తున్నారు. బుధవారం (జూలై 10) సాయంత్రం జరిగిన భజన కార్యక్రమంలో పాట పాడుతూ కుప్పకూలి పోయిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

చనిపోయిన బీరేంద్ర కుమార్ దాస్ ఏడీఎం గా మంచి గుర్తింపు ఉన్న అధికారి. బీరేంద్ర కుమార్ మృతి పట్ల పలువురు తీవ్ర సంతాపం  వ్యక్తం చేశారు. ఒడిశా సీఎం మోహన్ చర్ మాఝీ ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం తెలిపారు.  ఇక జిల్లా అధికారులైతే శోకం సంద్రంలో మునిగిపోయారు. ప్రజలకుసేవచేసే అధికారి అకస్మాత్తుగా చనిపోవడం పట్ల స్థానికులు కూడా విచారం వ్యక్తం చేశారు.