సిటీ శివారుల్లో కల్తీ దందా

సిటీ శివారుల్లో కల్తీ దందా
  • ఫేక్ లేబుల్స్‌‌, డూప్లికేట్ హోలోగ్రామ్​ స్టిక్కర్లు  

 ‘ రాగిపిండిలో రేషన్ బియ్యం పిండిని కలిపి కల్తీ చేస్తున్న వ్యక్తిని మల్కాజిగిరి ఎస్ వోటీ పోలీసులు ఈ నెల 18న  అరెస్ట్ చేసి.. 350 కల్తీ రాగి పిండి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.   నాగారంలోని ఓ గోడౌన్​లో అల్లం, వెల్లుల్లి పేస్ట్  లో కెమికల్స్ కలిపి కల్తీ చేస్తున్న వ్యక్తిని మల్కాజిగిరి ఎస్ వోటీ, కీసర పోలీసులు ఈ నెల 22న అదుపులోకి తీసుకున్నారు. 4 వేల 44 కిలోల కల్తీ అల్లం పేస్ట్ ను స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్‌‌,వెలుగు: సిటీ శివారు ప్రాంతాలు కల్తీ దందాలకు కేరాఫ్​గా మారుతున్నాయి. కల్తీ మాఫియా నకిలీ  ఐటెమ్స్​ను తయారు చేసి సిటీలో సప్లయ్ చేస్తోంది. వంట నూనెలు,హెయిర్ ఆయిల్స్, షాంపులు, టీ పౌడర్‌‌‌‌ ,వాటర్ బాటిల్స్‌‌, ఎలక్ట్రానిక్ గూడ్స్‌‌ సహా  దేన్నీ వదలడం లేదు.   బ్రాండెడ్‌‌ స్టిక్కర్స్ అంటించి హోల్‌‌సేల్‌‌ మార్కెట్‌‌కి సప్లయ్‌‌ చేసి  అక్కడి నుంచి రిటైల్‌‌మార్కెటింగ్‌‌కి డంప్‌‌ చేస్తోంది. ఇలా ఏటా సుమారు రూ.150 కోట్లు విలువ చేసే కల్తీ, ఫేక్ ఐటమ్స్  సేల్స్‌‌ జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. హోల్‌‌సేల్‌‌ మార్కెట్లకి  గుజరాత్‌‌, మహారాష్ట్ర, కర్నాటక నుంచి డూప్లికేట్‌‌ మెటీరియల్స్ ట్రాన్స్‌‌పోర్ట్ అవుతున్నట్లు చెప్తున్నారు.   కల్తీ దందా చేసే వాళ్లు.. యూజ్‌‌ చేసిన బ్రాండెడ్‌‌ కంపెనీల మెటీరియల్‌‌ రీ సైక్లింగ్‌‌ చేస్తున్నారు. ఒరిజినల్ కంపెనీకి ఏ మాత్రం తేడా లేకుండా ప్యాకింగ్ చేస్తున్నారు. కస్టమర్లు గుర్తించేందుకు వీలు లేకుండా డిజిటల్ ప్రింటింగ్‌‌ చేస్తున్నారు. ఒరిజినల్ గూడ్స్‌‌కంటే ఎక్కువ అట్రాక్ట్ గా ఉండేలా తయారు చేస్తున్నారు. పామాయిల్‌‌,నాసిరకం ఆయిల్‌‌ తయారు చేసి బ్రాండెడ్‌‌ ప్యాకింగ్‌‌ వేస్తున్నారు. ఇలాంటి డూప్లికెట్స్‌‌ను సిటీలోని హోల్‌‌సేల్‌‌ మార్కెట్స్‌‌కి సప్లయ్ చేస్తున్నారు. కల్తీ వస్తువులను గుర్తిస్తే  సమాచారం అందించాలని పోలీసులు చెప్తున్నారు. 
ఫేక్ లేబుల్స్ తో టీ ప్యాకెట్లు.. ఒకరి అరెస్ట్
ఉప్పల్:  బ్రాండెడ్ ​కంపెనీల ఫేక్ లేబుల్స్ తో  టీ ప్యాకెట్ల తయారీ కేంద్రంపై  మల్కాజిగిరి ఎస్ వోటీ, నాచారం పోలీసులు బుధవారం దాడులు చేసి ఒకరిని అరెస్ట్ చేశారు. ఉప్పల్ లోని గణేశ్​ నగర్ కి చెందిన గుంటి జితేందర్(42)  నాలుగు నెలల కిందట మల్లాపూర్​ గ్రీన్​హిల్స్​కాలనీలో ఒక ఇంటిని రెంట్ కి తీసుకున్నాడు. బేగంబజార్​లో విడిగా టీ పౌడర్ ను కొని ఫేక్ రెడ్ లేబుల్, త్రీ రోజెస్, తులసీ బ్రాంక్ ప్యాకింగ్ కవర్లలో ప్యాక్ చేసి ఒరిజనల్ అంటూ నమ్మించి అమ్మేవాడు. అతని దందాపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మల్కాజిరిగి ఎస్ వోటీ, నాచారం పోలీసులు గ్రీన్ హిల్స్ కాలనీలోని తయారీ కేంద్రంపై దాడి చేసి జితేందర్​ను అదుపులోకి తీసుకున్నారు. పౌచ్, సీలింగ్, వెయింగ్ మెషీన్, 20 కిలోల టీ పొడి, బ్రాండెడ్​ కంపెనీల  పేరుతో ఫేక్ లేబుల్స్ ను, 360 టీ బ్యాగ్ లు, కవర్ బండిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.4 లక్షల 25 వేలు ఉంటుందని ఇన్ స్పెక్టర్ కిరణ్ కుమార్    తెలిపారు. నిందితుడిని రిమాండ్ కి తరలించామన్నారు.