హైదరాబాద్లోని అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్స్ (ఏఈసీఎస్) టీజీటీ, పీఆర్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బి.ఎడ్, బి.ఈఐ.ఎడ్, డీ.ఈఐ.ఎడ్ పూర్తిచేసిన అభ్యర్థులు వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. ఇంటర్వ్యూలు మార్చి 23న ప్రారంభమై మార్చి 25న ముగుస్తుంది.
ఖాళీలు: ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ), ప్రైమరీ టీచర్స్ (పీఆర్టీ), బాలవాటిక టీచర్స్. ఇంగ్లిష్, సోషల్ సైన్స్, హిందీ/ సంస్కృతం, మ్యాథ్స్/ ఫిజిక్స్, కెమిస్ట్రీ/ బయాలజీ, కంప్యూటర్ సైన్స్, తెలుగు, మ్యూజిక్ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఎలిజిబిలిటీ: పోస్టులను అనుసరించి వేర్వేరు విద్యార్హతలు ఉన్నాయి. కాబట్టి నిర్దిష్ట అధికారిక నోటిఫికేషన్ చూడగలరు.
గరిష్ట వయోపరిమితి: 35 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా. ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.
వాక్ ఇన్ ఇంటర్వ్యూలు
స్కిల్ టెస్ట్ & డెమో టీచింగ్ – టీజీటీ (ఇంగ్లిష్, సోషల్ సైన్స్, హిందీ/ సంస్కృతం, మ్యాథ్స్/ ఫిజిక్స్, కెమిస్ట్రీ/ బయాలజీ): మార్చి 23.
స్కిల్ టెస్ట్ & డెమో టీచింగ్ ప్రైమరీ టీచర్ (పీఆర్ టీ): మార్చి 24.
స్కిల్ టెస్ట్ & డెమో టీచింగ్ - టీజీటీ (కంప్యూటర్ సైన్స్), పీఆర్ టీ (తెలుగు), పీఆర్ టీ (మ్యూజిక్), బాలవాటిక టీచర్ (బీవీ టీ): మార్చి 25.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, స్కిల్ టెస్ట్, డెమో టీచింగ్ క్లాస్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్ సైట్ www.nfc.gov.in ను సంప్రదించండి.
►ALSO READ | BELలో ఉద్యోగాలు: మంచి జీతం.. బీఈ/బీటెక్ అర్హత ఉంటే చాలు..
