
సిట్ క్రిమినల్ రివిజన్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు జరిగాయి. ఏసీబీ కోర్ట్ తన పరిధి దాటి వ్యవహరించిందని అడ్వొకేట్ జనరల్ వాదించారు. మెమో రిజెక్ట్ చేసే అధికారం ఏసీబీ కోర్టుకు ఉన్నా.... కోర్ట్ ఇచ్చిన ఆర్డర్ క్వాష్ పిటిషన్ ఆర్డర్ లా ఉందని తెలిపారు. ఏసీబీ కోర్ట్ ఇచ్చిన ఆర్డర్ సమర్ధించిన ప్రతిపాదిత నిందితుల తరపు లాయర్. ఈ కేసులో ప్రతిపాదిత నిందితులకు నోటీసులు ఇచ్చారు. సిట్ అధికారులు వేసిన క్రిమినల్ రివిజన్ పిటీషన్ వివరాలను ప్రతిపాదిత నిందితులకు ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా పడింది.
ఫాంహౌస్ కేసులో ఏసీబీ కోర్టు మెమో రిజెక్ట్ చేయడంపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) హైకోర్టును ఆశ్రయించింది. కేసును ఏసీబీ మాత్రమే దర్యాప్తు చేయాలని, పోలీసులు, సిట్ కు ఆ అధికారం లేదన్న కోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రివిజన్ పిటిషన్ దాఖలు చేసింది. ఇవాళ ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్ట్ తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.