
సీఎం మార్పు ప్రతి పక్షాల తప్పుడు ప్రచారమన్నారు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. మే నెలాఖరులో లేదా జూన్ మొదటి వారంలో మంత్రి వర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందన్నారు. పలు సమీకరణాల వల్లే మంత్రి వర్గ విస్తరణలో జాప్యం జరుగుతోందన్నారు. మంత్రులు అందరం కలిసే ఉన్నామని.. కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ప్రజలకు ఉన్న అవసరాలు తీర్చడమే తమ ముందున్న లక్ష్యమన్నారు.
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు వక్రీకరించారని చెప్పారు మహేహ్ కుమార్ గౌడ్. . సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారం చేసిన వారిపై సైబర్ క్రైమ్ లో కేసు పెడతామన్నారు. సోషల్ మీడియా అసత్య ప్రచారాలపై మధ్య ప్రదేశ్ విధానం అమలు చేస్తామని చెప్పారు. మే 26 , 27 తేదీల్లో పీసీసీ కార్యవర్గం ఖరారయ్యే అవకాశం ఉందని తెలిపారు. బీఆర్ఎస్ మూడు ముక్కలాట నడుస్తుందన్నారు. మహిళా కాంగ్రెస్ ఆందోళన సర్వ సాధారణమన్నారు. మహిళలకు కాంగ్రెస్ లో ఉన్నంత ప్రాధాన్యత మరే పార్టీలో లేదన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.
►ALSO READ | కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం.. మంత్రి పొన్నం
సీఎం రేవంత్ రెడ్డి వల్లే మంత్రి వర్గ విస్తరణ ఆగిందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో సీఎం మార్పు ఖాయమంటూ ఇటీవల బీజేపీ,బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో పీసీసీ చీఫ్ మహేశ్ ఈ వ్యాఖ్యలను ఖండించారు.