
తెలంగాణ ప్రభుత్వం మహిళలకు కల్పించిన ఉచిత బస్సు సౌకర్యం.. మహలక్ష్మి పథకం అమలు తీరును మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా పర్యవేక్షించారు. అ ఈరోజు ( మే 17) పంజాగుట్ట నుంచి లకడీకపూల్ వరకు ఆర్టీసీ బస్సులో టికెట్ తీసుకొని ప్రయాణించారు. మహిళా ప్రయాణికులతో ముచ్చటించిన మంత్రి .. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. మహలక్ష్మీ పథకం అమలు తీరు గురించి మహిళలను అడిగి తెలుసుకున్నారు.
నిత్యం బస్సుల్లో ప్రయాణించే మహిళలు ఈ పథకం తమకు ఎంతో ఉపయోగపడుతుందని మంత్రికి వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తాము ఫ్రీగా బస్సులో ప్రయాణం చేయడం వలన డబ్బులు ఆదా అవుతున్నాయని మంత్రి ఎదుట సంతోషం వ్యక్తం చేశారు. బస్సుల రద్దీ గురించి మంత్రి ప్రస్తావిస్తూ... హైదరాబాద్ లో తిరిగేందుకు కొత్త బస్సులు భారీ సంఖ్యలో వచ్చాయని.. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండాఅన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ... ప్రజాపాలన ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అర్హులైన వారందరికి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని.. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు... 200 యూనిట్ల ఉచిత విద్యుత్.. రూ. 500 కు గ్యాస్ కనక్షన్... కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసేందుకే మహిళా సంఘాలకు ప్రత్యేక పథకాలు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ప్రజా పాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని ,లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు వస్తున్నాయనీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 కి గ్యాస్ వంటి పథకాలతో.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా మహిళా సంఘాలకు బస్సులు వారికి ప్రత్యేక పథకాలు అందిస్తున్నామని తెలిపారు..