
హిందుస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐటీఐ ట్రేడులో ఉత్తీర్ణత సాధించిన వారు వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. ట్రేడుల వారీగా మే 26–28 వరకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించవచ్చు.
పోస్టుల సంఖ్య: 195.
పోస్టులు: ఎలక్ట్రానిక్స్, మెకానిక్ 55, ఫిట్టర్ 45, ఎలక్ట్రీషియన్ 10, మెషినిస్ట్ 10, టర్నర్ 06, వెల్డర్ 03, రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ 02, సీఓపీఏ 50, ప్లంబర్ 02, పెయింటర్ 06, డీజిల్ మెకానిక్ 01, మోటార్ వెహికల్ మెకానిక్ 01.
ఎలిజిబిలిటీ: ఎన్సీవీటీ గుర్తించిన సంస్థ నుంచి సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణ సాధించి ఉండాలి.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ: ఎలక్ట్రానిక్ మెకానిక్, డీజిల్ మెకానిక్, ఫిట్టర్, ప్లంబర్, పెయింటర్ మే 26.
సీఓపీఏ, మోటార్ వెహికల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, డ్రాఫ్ట్స్ మెన్– మెకానికల్ మే 27.
మెషినిస్ట్, రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ, టర్నర్, డ్రాఫ్ట్స్ మెన్– సివిల్, వెల్డర్ మే 28.