Today OTT Movies: ఇవాళ (మే 16) ఒక్కరోజే ఓటీటీలోకి 10కి పైగా సినిమాలు, సిరీస్లు..

Today OTT Movies: ఇవాళ (మే 16) ఒక్కరోజే ఓటీటీలోకి 10కి పైగా సినిమాలు, సిరీస్లు..

ప్రతిశుక్రవారం థియేటర్/ ఓటీటీల్లో కొత్త సినిమాల సందడి ఉంటుంది. ఈ శుక్రవారం (మే16న) కూడా థియేటర్ లో మూడు సినిమాలొచ్చాయి. అందులో వేటికవే భిన్నమైన జోనర్స్లో అలరిస్తున్నాయి. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ కూడా థియేటర్స్కు ధీటుగా 10కి పైగా సినిమాలు తీసుకొచ్చింది.

ALSO READ | 23 Review: వ్యవస్థను ప్రశ్నించే కథతో మల్లేశం డైరెక్టర్.. 1993 చిలకలూరి పేట బస్సు అగ్నిప్రమాదంపై మూవీ

అందుకు తగ్గట్టుగానే మల్టిపుల్ జోనర్స్లో అందుబాటులో ఉంచింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, SUN NXT,జియో హాట్‌స్టార్ వంటి వేదికలలో సినిమాలు స్ట్రీమ్ అవుతున్నాయి. మరి ఆ సినిమాలేంటీ? అందులో ఏ సినిమాలు స్పెషల్గా చూడాలి? తెలుగులో ఎన్ని సినిమాలు ఉన్నాయి? అనేది చూద్దాం. 

నెట్‌ఫ్లిక్స్:

డియర్ హాంగ్‌రాంగ్ (తెలుగు డబ్బింగ్ కొరియన్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మే 16

రొట్టెన్ లెగసీ (స్పానిష్ పొలిటికల్ ఫ్యామిలీ డ్రామా థ్రిల్లర్ సిరీస్)- మే 16

ఫుట్‌బాల్ పేరెంట్స్ (ఇంగ్లీష్ కామెడీ వెబ్ సిరీస్)- మే 16

స్నేక్స్ అండ్ ల్యాడర్స్ ( స్పానిష్ వెబ్ సిరీస్)- మే 14

థ్యాంక్యూ, నెక్ట్స్ సీజన్ 2 ( టర్కీష్ రొమాంటిక్ వెబ్ సిరీస్)- మే 15

ఫ్రాంక్లిన్ (ఇంగ్లీష్ పీరియాడిక్ డ్రామా సిరీస్)- మే 15

టేస్టీ‌ఫుల్లీ యువర్స్ (కొరియన్ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- మే 12

C4 సింటా ( మలేషియన్ తమిళ రొమాంటిక్ కామెడీ)- మే 12

బ్యాడ్ థాట్స్ ( ఇంగ్లీష్ డార్క్ కామెడీ వెబ్ సిరీస్)- మే 13

ఆహా తమిళ్:

మనమే (తమిళ డబ్బింగ్ తెలుగు రొమాంటిక్ ఫ్యామిలీ)- మే 16

ఈటీవీ విన్

అనగనగా (తెలుగు ఫ్యామిలీ డ్రామా)- మే 15

అమెజాన్ ప్రైమ్:

ఏ వర్కింగ్ మ్యాన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యాక్షన్ థ్రిల్లర్)- మే 16

భూల్ చుక్ మాఫ్ (హిందీ రొమాంటిక్ కామెడీ)- మే 16

అర్జున్ సన్నాఫ్ వైజయంతి (ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్)- మే 12

సోనీ లివ్ 

మరణమాస్ (మలయాళ డార్క్ కామెడీ)-మే 15

జియో హాట్‌స్టార్:

హాయ్ జునూన్ (ఇండియన్ మ్యూజికల్ డ్రామా వెబ్ సిరీస్)- మే 16

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది వార్ ఆఫ్ ది రోహ్రిమ్ (ఇంగ్లీష్ యాక్షన్ ఫాంటసీ యానిమేషన్)- మే 13

వూల్ఫ్ మ్యాన్ (ఇంగ్లీష్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్) - మే 17

SUN NXT:

నెసిప్పయ (తమిళ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్) -మే 16

అయ్యర్ ఇన్ అరేబియా (మలయాళ కామెడీ)- మే 16

యాపిల్ ప్లస్ టీవీ:

మర్డర్‌బాట్ (ఇంగ్లీష్ యాక్షన్ కామెడీ)- మే 16

మనోరమ మ్యాక్స్:

పరన్ను పరన్ను పరన్ను చెల్లన్ (మలయాళ రొమాంటిక్ కామెడీ డ్రామా)- మే 16

సింప్లీ సౌత్:

క.ము క.పి (తమిళ రొమాంటిక్ డ్రామా)- మే 16

లయన్స్ గేట్ ప్లే:

కర్ఫ్యూ (ఇంగ్లీష్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మే 16

ఈ వారం వచ్చినవన్నీ స్పెషల్ మూవీస్ అనే చెప్పుకోవాలి. అందులో సుమంత్ హీరోగా నటించిన ఫ్యామిలీ డ్రామా 'అనగనగా', కల్యాణ్ రామ్ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఈ రెండు సిసినిమాలు డైరెక్ట్ తెలుగు సినిమాలు కావడం విశేషం. ఇక తెలుగు డబ్బింగ్ మాత్రం మలయాళ డార్క్ కామెడీ మరణమాస్, నెసిప్పయ సినిమాలున్నాయి. ఇక మిగతా సినిమాల్నీ ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో అందుబాటులో ఉండనున్నాయి.

ALSO READ | 7/G Sequel Heroine: ‘7/G’ సీక్వెల్ అప్డేట్.. మన మధ్యతరగతి రవికి అమ్మాయి దొరికేసింది

ఇవాళ (మే 16) ఒక్కరోజే 10కి పైగా సినిమాలు, సిరీస్ లున్నాయి. వీటిలో డియర్ హాంగ్‌రాంగ్, ఏ వర్కింగ్ మ్యాన్ తెలుగు డబ్బింగ్, భూల్ చుక్ మాఫ్, హాయ్ జునూన్, మర్డర్ బాట్ సినిమాలు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. తెలుగులో డబ్ అయిన సినిమాల్లో 2 ఇంట్రెస్టింగ్‌గా అందుబాటులోకి వచ్చాయి. తెలుగు మూవీ శర్వానంద్ నటించిన మనమే తమిళంలో డబ్ అయి నేడు ఆహాలో అలరించనుంది.