7/G Sequel Heroine: ‘7/G’ సీక్వెల్ అప్డేట్.. మన మధ్యతరగతి రవికి అమ్మాయి దొరికేసింది

7/G Sequel Heroine: ‘7/G’ సీక్వెల్ అప్డేట్.. మన మధ్యతరగతి రవికి అమ్మాయి దొరికేసింది

ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన  ‘7/జీ బృందావన కాలనీ’చిత్రం అప్పట్లో తెలుగు, తమిళ భాషల్లో సెన్సెషనల్ హిట్‌‌‌‌గా నిలిచింది. దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంతో రవికృష్ణ, సోనియా అగర్వాల్‌‌‌‌కు మంచి బ్రేక్ వచ్చింది.

ఇప్పటికీ ఈ సినిమాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండటంతో గతేడాది దీనికి సీక్వెల్ ప్రకటించారు మేకర్స్. షూటింగ్ కూడా దాదాపు పూర్తవుతుంది. కానీ ఇందులో నటిస్తున్న నటీనటులు ఎవరనేది ఇప్పటివరకు రివీల్ చేయలేదు. ఈ సినిమాలో ర‌వికృష్ణ‌ హీరోగా కంటిన్యూ అవుతున్నాడు. ఇందులో హీరోయిన్‌‌‌‌గా ‘లవ్ టుడే’ ఫేమ్ ఇవానా, దర్శకుడు శంకర్ కూతురు అదితి నటిస్తున్నారని ప్రచారంలో ఉంది.

ALSO READ | HHVM Release Date: పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్..

అయితే వీరెవరు కాదని, మలయాళ నటి అనస్వరరాజన్ ఈ చిత్రంలో హీరోయిన్‌‌‌‌గా నటిస్తుందని లీకులు వచ్చాయి. మూవీ టీమ్ అఫీషియల్‌‌‌‌గా ప్రకటించనప్పటికీ షూటింగ్‌‌‌‌ స్పాట్‌‌‌‌కు సంబంధించిన ఫొటోస్‌‌‌‌లో ఆమె కనిపిస్తోంది. తన ఫిల్మోగ్రఫీలోనూ ఈ చిత్రం ఉండటంతో అనస్వరరాజన్‌‌‌‌ విషయంలో క్లారిటీ వచ్చినట్టైంది.

తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్విల్‌‌‌‌ మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రంతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ కూడా కన్‌‌‌‌ఫర్మ్ అయినట్టే. ఏఎమ్ రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. మరోవైపు ఈ చిత్రంతో పాటు మరో నాలుగు మలయాళ మూవీస్‌‌‌‌లో అనస్వర నటిస్తోంది.