HHVM Release Date: పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్..

HHVM Release Date: పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ పీరియాడిక్ మూవీ ‘హరిహర వీరమల్లు’.రెండు భాగాలుగా రూపొందిన ఈ పాన్ ఇండియా మూవీ ఫస్ట్ పార్ట్‌‌‌‌ను ‘హరిహర వీరమల్లు: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’పేరుతో తెరకెకిక్కించారు. 

దర్శకుడు క్రిష్ కొంత భాగాన్ని తెరకెక్కించగా, జ్యోతి కృష్ణ బ్యాలెన్స్‌‌‌‌ షూట్‌‌‌‌ను డైరెక్ట్ చేశాడు. అయితే, ఈ మూవీ పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. మే 9న విడుదల కావల్సి ఉండగా మరోసారి వాయిదా పడింది. దాంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొత్త రిలీజ్ డేట్ కావాలని మేకర్స్ పై ఒత్తిడి తీసుకుసుకొచ్చారు. 

ఈ క్రమంలో నేడు మే16న కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు. జూన్ 12న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. “జీవితకాల యుద్ధానికి సిద్ధంగా ఉండండి. హరి హర వీరమల్లు కోసం జూన్ 12న మీ క్యాలెండర్ ను మార్క్ చేసుకోండి. ధర్మం కోసం యుద్ధం ప్రారంభం కాబోతోంది” అనే క్యాప్షన్ తో వివరాలు వెల్లడించారు. అతి త్వరలోనే ప్రమోషన్స్ శరవేగంగా మొదలవ్వనున్నాయి.

ఇకపోతే, ఈ సినిమాను మే 30న రిలీజ్ చేయాలని మేకర్స్ భావించినా.. ఆ డేట్ కూడా వర్కవుట్ కాలేదు. అన్ని విధాలుగా జూన్ 12 అయితే, సేఫ్ డేట్ అని మేకర్స్ ఫిక్స్ అయి నేడు కొత్త డేట్ అనౌన్స్ చేశారు.

ALSO READ | 23 Review: వ్యవస్థను ప్రశ్నించే కథతో మల్లేశం డైరెక్టర్.. 1993 చిలకలూరి పేట బస్సు అగ్నిప్రమాదంపై మూవీ

మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎం రత్నం సమర్పిస్తున్న ఈ సినిమాను దయాకర్ రావు ప్రొడ్యూస్ చేస్తున్నారు. దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో.. పవన్ కల్యాణ్ బంధిపోటుగా కనిపించనున్నాడు. నిధి అగర్వాల్, అర్జున్ రాంపాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.