క్యాన్సర్‎తో ప్రముఖ సింగర్ గాయత్రి కన్నుమూత

క్యాన్సర్‎తో ప్రముఖ సింగర్ గాయత్రి కన్నుమూత

దిస్‎పూర్: అస్సాం సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చే సుకుంది. ప్రముఖ అస్సామీ సింగర్ గాయత్రి హజారికా (44) కన్నుమూశారు. గత కొంత కాలంగా పెద్దప్రేగు క్యాన్సర్‌తో బాధపడుతోన్న ఆమె గువహతిలోని నెమ్‌కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శుక్రవారం (మే 16) తుదిశ్వాస విడిచారు. సరా పాటే పాటే ఫాగున్ నామే పాట ద్వారా సింగర్‎గా మంచి గుర్తింపు పొందిన గాయత్రి 44 ఏళ్ల వయస్సులోనే మరణించడంతో అస్సామీ సంగీత పరిశ్రమ తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. తుమి కున్ బిరోహి అనన్య, జంక్ నాసిల్ బోనోట్, క్సుజీ జోపోన్ వంటి అద్భుతమైన పాటలతో ద్వారా గాయత్రి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.

ALSO READ | ప్రముఖ యాక్టర్ కన్నుమూత.. US ఆర్మీలో రెండేళ్లు.. ఆ తర్వాత నటుడిగా గుర్తింపు

గాయత్రి మరణవార్త తెలుసుకుని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, ఆమె అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు. సింగర్ గాయత్రి హజారికా మరణం పట్ల అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయత్రి అద్భుతమైన స్వరం, అస్సామీ సంగీతానికి ఆమె చేసిన శాశ్వత కృషి ఎల్లప్పుడూ గుర్తుండిపోతుందని కొనియాడారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ గాయత్రి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

అసోం గణ పరిషత్ అధ్యక్షుడు అతుల్ బోరా కూడా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా గాయత్రి హజారికా మృతి పట్ల సంతాపం తెలిపారు. గాయత్రి అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఆమె ఆత్మీయ స్వరం అస్సామీ సంగీతాన్ని సుసంపన్నం చేసిందని.. లెక్కలేనన్ని హృదయాలను తాకిందని పేర్కొన్నారు. సింగర్‎గా ఎంతో భవిష్యత్ ఉన్న ఆమె చిన్న వయస్సులో మృతి చెందటం చాలా బాధాకరమన్నారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.