ప్రముఖ యాక్టర్ కన్నుమూత.. US ఆర్మీలో రెండేళ్లు.. ఆ తర్వాత నటుడిగా గుర్తింపు

ప్రముఖ యాక్టర్ కన్నుమూత.. US ఆర్మీలో రెండేళ్లు.. ఆ తర్వాత నటుడిగా గుర్తింపు

ప్రముఖ హాలీవుడ్ నటుడు జో డాన్ బేకర్ (89) కన్నుమూశారు. మూడు జేమ్స్ బాండ్ చిత్రాల సిరీస్‌లో నటించిన జో డాన్ వాకింగ్ టాల్ పాత్రతో మంచి గుర్తింపు పొందారు. ఈ నెల (మే7న) జో డాన్ బేకర్ మృతిచెంచినట్లు ఆయన కుటుంబం ప్రకటించింది.

అయితే, ఆయన మరణానికి గల కారణం మాత్రం వెల్లడించలేదు. గతకొంతకాలంగా నటుడు జో డాన్ ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడుతు చనిపోయినట్లు సమాచారం. 

ఫిబ్రవరి 12, 1936న టెక్సాస్‌లోని గ్రోస్‌బెక్‌లో జన్మించిన బేకర్, US ఆర్మీలో రెండు సంవత్సరాలు పనిచేసిన తర్వాత నార్త్ టెక్సాస్ స్టేట్ కాలేజీ నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ పొందాడు. తరువాత అతను తన చలనచిత్ర మరియు టెలివిజన్ కెరీర్‌ను స్టార్ట్ చేయడానికి ముందు ప్రపంచ ప్రఖ్యాత యాక్టర్స్ స్టూడియోలో నటుడిగా శిక్షణ పొందడానికి న్యూయార్క్ నగరానికి వెళ్లాడు.

ఆ తర్వాత బేకర్ 1965లో టెలివిజన్ సిరీస్ హనీ వెస్ట్ ద్వారా స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చాడు. 1967లో కూల్ హ్యాండ్ ల్యూక్ చిత్రంలో ఒక చిన్న పాత్రలో నటించి అందర్నీ ఆకర్షించాడు. 1973లో వాకింగ్ టాల్ మూవీ అతనికి పెద్ద బ్రేక్ వచ్చింది.

ఇందులో అతను షెరీఫ్ బుఫోర్డ్ పస్సర్ పాత్ర పోషించాడు. ది లివింగ్ డేలైట్స్ (1987), గోల్డెన్ ఐ (1995) మరియు టుమారో నెవర్ డైస్ (1997) చిత్రాలలో జేమ్స్ బాండ్ చిత్రాలలో కనిపించడం ద్వారా అతను మరింత గుర్తింపు పొందాడు.