పెద్దపల్లి ఎంపీకి అవమానం..మే 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు

పెద్దపల్లి ఎంపీకి అవమానం..మే 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు

సరస్వతి పుష్కరాల్లో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు జరిగిన అవమానంపై దళిత సంఘాల నేతలు  ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎంపీ అయిన వంశీ కృష్ణ దళితుడైనందుకే   పుష్కరాలకు ఆహ్వానించలేదన్నారు. ఇన్విటేషన్ లో ఆయన ఫోటో పెట్టకుండా ప్రోటోకాల్ ను విస్మరించారని చెప్పారు. దేవాదాయశాఖ అధికారులు కావాలనే ఇలా చేశారన్నారు. ఇది యావత్ దళిత జాతిపై జరిగిన వివక్ష అని అన్నారు.  

రాష్ట్ర ప్రభుత్వానికి 24 గంటలు సమయం ఇస్తున్నామని ..  భేషరుత్తుగా గడ్డం వంశీ కృష్ణకు క్షమాపణ చెప్పి మే 26 వరకు పుష్కరాల్లో ఆయనను ఆహ్వానించి .. ప్రోటోకాల్ పాటించాలన్నారు.  లేని పక్షలో దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడితో పాటు, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పార్లమెంట్ హౌజ్ కమిటీ కి అప్పీల్ చేసి సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని కోరాతామన్నారు.  అంబేద్కర్ విధానాలు, రాజ్యాంగానికి విరుద్ధంగా దేవాదాయ శాఖ అధికారులు వ్యవహరించారని చెప్పారు.  రేపటినుంచి అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు దళిత సంఘాల నాయకులు.

►ALSO READ | స్వయం సహాయక సంఘాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి.. కోటి మందిని కోటీశ్వరులను చేస్తాం: సీఎం రేవంత్

మరో వైపు దేవాదాయ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని గోదావరి ఖని అంబేద్కర్ చౌరస్తా దగ్గర  కాంగ్రెస్ నాయకులు  ఆందోళన చేశారు.. ఎంపీ వంశీకృష్ణను ఆహ్వానించకపోవడాన్ని తప్పుబట్టారు. ఫ్లెక్సీలలలో ఆయన ఫోటోను ముద్రించకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు.  ఇప్పటికైనా స్పందించి ఎంపీ వంశీకృష్ణను ఆహ్వానించి ప్రోటోకాల్ పాటించాలని డిమాండ్ చేశారు.