
న్యూఢిల్లీ: 1980లో తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కనుగొన్న మాంసాహార డైనోసార్ ఆనవాళ్లు దాదాపు23 కోట్ల సంవత్సరాల నాటివని సైంటిస్టులు లేటెస్ట్ గా తేల్చారు. అంటే మంచు యుగం ,రాతి యుగం కంటే ముందు.. జురాసిక్ కాలానికి చాలా కాలం ముందు ట్రయాసిక్ యుగం నాటి ఆనవాళ్లు కూడా తెలంగాణలో ఉన్నట్టు తేల్చారు సైంటిస్టులు.
ప్రాణహిత-గోదావరి లోయలో ఉన్న అన్నారం గ్రామం సమీపంలో వేమనపల్లిలోని అడవిలో కొన్ని వేల ఏళ్ల క్రితం డైనోసార్లు( రాక్షస బల్లులు) సంచరించినట్లు ఆర్మీ యాలజిస్టులు చెప్తున్నారు. 1980లో మంగెనపల్లి అటవీ ప్రాంతంలో డైనోసార్ అవశేషాలను భూగర్భ, పురావస్తు శాఖ అధికారులు కనుగొన్నారు. 1.4 మీటధ పొడవు. 5.5 మీటర్ల ఎత్తుండే డైనోసార్ అవశేషాలు ఇక్కడ దొరికాయి. దశాబ్దాల నిరంతర పరిశోధనల తర్వాత శాస్త్రవేత్తలు ఇప్పుడు ఈ అవశేషాలు హెర్రెరసౌరిడే కుటుంబానికి చెందినవని నిర్ధారించారు.
Also Read : పక్కింటి వాస్తు మనపై ఎలాంటి ప్రభావం ఉంటుంది
ఆ రాక్షస బల్లి వయసు దాదాపు 23 కోట్ల సంవత్సరాల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.దక్షిణ అమెరికా వెలుపల ఈ రకమైన డైనోసార్ ను కనుక్కోవడం ఇదే తొలిసారి. మాలేరి కొండల్లో ఈ డైనోసార్ అవశేషాలు ఉండటంతో ఆ ప్రాంతం పేరుతో పాటు మొదటి సారి ఈ అవశేషాలను గుర్తించిన శాస్త్రవేత్త తారావత్ కుట్టికి గుర్తింపుగా ఈ డైనోసార్ కు మాలేరి రాప్టర్ కుట్టి అని పేరు పెట్టారు.
ట్రయాసిక్ కాలంలో వేడి ఎక్కువగా ఉండేదంట. అంటే అంతటి వేడి వాతావరణంలో డైనోసార్ ఎలా అభివృద్ధి చెందిందనేదానిపై సైంటిస్టులు పరిశోధనలు కొనసాగిస్తున్నారు . తెలంగాణలో గుర్తించిన ఈ డైనోసార్ ఆనవాళ్లతో పరిశోధనల్లో మరింత వేగం పెంచవచ్చని సైంటిస్టులు భావిస్తున్నారు.