
- హెచ్ఆర్సీలో అడ్వకేట్ రామారావు పిటిషన్
పద్మారావునగర్, వెలుగు: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో దారుణ పరిస్థితులు ఉన్నాయని మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మానేని జాతీయ మానవ హక్కుల కమిషన్లో పిటిషన్ దాఖలు చేశారు. ఈఐ హాస్టల్లో న్యాయశాస్త్రం అభ్యసించే విద్యార్థులకు ప్రాథమిక హక్కులు కొరవడ్డాయన్నారు. 120 మందికి ఒకే బాత్రూం, వర్షానికి గదుల పైకప్పుల నుంచి నీరు కారడం, వాటర్ ఫిల్టర్ల లేమి, ఒకే గదిలో 8-10 మంది విద్యార్థులు ఉండటం వంటి సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
అయినా యూనివర్సిటీ అధికారులు పట్టించుకోవడం లేదని పిటిషన్లో పేర్కొన్నారు. వైస్ చాన్సలర్ వెంటనే చర్యలు తీసుకొనే విధంగా ఆదేశాలు జారీ చెయ్యాలంటూ కమిషన్ను కోరారు. ఈ పిటిషన్పై కమిషన్ విచారణ చేపట్టింది.