ఏసీబీకి చిక్కిన యాలాల పంచాయతీరాజ్ ఇన్ చార్జి ఏఈ

ఏసీబీకి చిక్కిన యాలాల పంచాయతీరాజ్ ఇన్ చార్జి ఏఈ

వికారాబాద్,​ వెలుగు : కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ వికారాబాద్ జిల్లా యాలాల మండల పంచాయతీరాజ్ ఇన్ చార్జ్ ఏఈ ఏసీబీకి పట్టుబడ్డాడు. యాలాల మండలంలో కాంట్రాక్టర్​ వెంకటయ్య..తాను పూర్తి చేసిన  పనుల బిల్లులు చెల్లించాలని పంచాయతీరాజ్ ఇన్ చార్జి ఏఈ  మధును కోరాడు.  దీనికి ఏఈ రూ. 39 వేలు డిమాండ్ చేయగా..  రూ.30వేలకు ఒప్పందం కుదిరింది. అంతకుముందే  వెంకటయ్య ఏసీబీని ఆశ్రయించాడు. గురువారం ఇన్ చార్జి ఏఈ మధు సిటీకి వచ్చి మ‌లక్ పేటలో వెంకటయ్య నుంచి డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మధు కొద్దికాలం కిందటే యాలాల ఇన్ చార్జ్ ఏఈగా  వచ్చాడు.  అంతకుముందు కొడంగల్ లో పనిచేయగా.. అక్కడా కాంట్రాక్టర్లను వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి.