రక్తపాతం వద్దనే దేశం వదిలా..

రక్తపాతం వద్దనే దేశం వదిలా..

కాబుల్: అరవై లక్షల మంది నివసించే కాబుల్​లో రక్తపాతాన్ని నివారించేందుకే అఫ్గానిస్తాన్​ను వీడాల్సి వచ్చిందని ఆ దేశ ప్రెసిడెంట్ అష్రప్ ఘనీ అన్నారు. ‘20 ఏండ్లుగా దేశాన్ని కాపాడుతూ వచ్చాను. ఇప్పటివరకు తాలిబాన్ల చేతిలో ఎంతోమంది చనిపోయారు. ప్రతిఘటిస్తే కాబుల్ నాశనమయ్యేది. రక్తపాతం ఆపడానికి బయటకు రావడమే ఉత్తమమని అనుకున్నాను. తాలిబాన్లు కత్తులు, తుపాకులతో శాసించాలనుకుంటున్నారు. ఇప్పుడు దేశ గౌరవం, సంపద అన్నింటినీ కాపాడాల్సిన బాధ్యత వారిపైనే ఉంది. దేశ భవిష్యత్ కోసం ఓ స్పష్టమైన ప్రణాళికను రూపొందించాలె..’ అని ఫేస్ బుక్​లో పోస్టు చేశారు.

4 కార్లు, హెలికాప్టర్ నిండా పైసలతో..

నాలుగు కార్లు, ఓ హెలికాప్టర్ నిండా క్యాష్​తో అష్రప్ ఘనీ దేశాన్ని విడిచివెళ్లినట్లు కాబుల్​లోని రష్యా ఎంబసీ వెల్లడించింది. ఘనీ అఫ్గాన్ నుంచి వెళ్లిన విధానం గురించి రష్యన్ ఎంబసీ కార్యదర్శి నికితా ఇష్చెంకో మీడియాకు తెలిపారు. ‘4 కార్ల నిండా డబ్బుంది. హెలికాప్టర్​లో కూడా డబ్బు నింపే ప్రయత్నం చేశారు. కొంత క్యాష్  రోడ్డుపై పడినట్లుగా కనిపించింది’ అని చెప్పారు