AFG vs PAK: మంటగలిసిన పాక్ క్రికెట్ పరువు.. చివరకు ఆఫ్ఘనిస్తాన్ చేతిలో కూడా ఓడారు

AFG vs PAK: మంటగలిసిన పాక్ క్రికెట్ పరువు.. చివరకు ఆఫ్ఘనిస్తాన్ చేతిలో కూడా ఓడారు

1992 ఛాంపియన్‌.. 1999 రన్నరప్‌.. 1975 మినహా వరుసగా మూడు సార్లు  సెమీస్‌ చేరిన జట్టు.. ఇది నిన్నటివరకు పాకిస్తాన్ క్రికెట్ జట్టు గురుంచి అభిమానులు మాట్లాడుకున్న మాటలు. కానీ, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ చేతిలో పరాజయం పాలైన ఓ అనామక జట్టు. చూశారుగా.. గంటల వ్యవధిలో పాకిస్తాన్ క్రికెట్ పరువు ఎలా గంగలో కలిసిపోయిందో..

సోమవారం చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్ లో  పాకిస్థాన్ కు బిగ్ షాక్ తగిలింది. పసికూన ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఘోర ఓటమి పాలైంది. బ్యాటింగ్ లో పర్వాలేదనిపించిన పాక్.. బౌలింగ్ లో మాత్రం తేలిపోయింది. 283 పరుగుల టార్గెట్ ను ఆఫ్గాన్ జట్టు ఆడుతూ పాడుతూ కొట్టేశారు. వరుసగా రెండు విజయాలతో టోర్నీని ఘనంగా ఆరంభించిన బాబర్ సేన.. ఆ తర్వాత జరిగిన మూడు మ్యాచ్ ల్లో ఓడిపోయి సెమీస్ అవకాశాలను క్లిష్టం చేసుకుంది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ మాత్రం ఈ టోర్నీలో రెండో విజయాన్ని నమోదు చేసుకొని సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. 

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. కెప్టెన్ బాబర్ అజామ్ 74 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ 58 పరుగులు చేసాడు. చివర్లో షాదాబ్ ఖాన్(40), ఇఫ్తికార్ అహ్మద్ (40) మెరుపులు మెరిపించడంతో ఆఫ్ఘనిస్తాన్ ముందు 283 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. 

Also Read :- పులిగోరు లాకెట్ .. బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ అరెస్ట్

లక్ష్య ఛేదనలో ఆఫ్ఘన్ ఓపెనర్లు పాక్ బౌలర్లను ఈజీగా ఆడేశారు. గర్భాజ్(65), ఇబ్రహీం జద్రాన్(47) తొలి వికెట్ కు 130 పరుగులు జోడించి ఆఫ్ఘనిస్తాన్ ను విజయతీరాలకు నడిపించారు. వీరిద్దరూ ఔటైనా రహ్మతుల్లా షా(77), కెప్టెన్ హాశ్మతుల్లా షాహిద్(48) జాగ్రత్తగా చివరి వరకు ఆడుతూ ఆఫ్ఘనిస్తాన్ కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు.