ఆగస్టు 15 తర్వాత గ్రామాల్లో నీళ్లు, కరెంట్ బంజేస్తం: పంచాయతీ కార్మికుల హెచ్చరిక

ఆగస్టు 15 తర్వాత గ్రామాల్లో నీళ్లు, కరెంట్ బంజేస్తం: పంచాయతీ కార్మికుల హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు: ఆగస్టు 15 తర్వాత గ్రామాల్లో నీళ్లు, కరెంట్ ​బంజేస్తామని గ్రామ పంచాయతీ కార్మికులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గురువారం గ్రామ పంచా యతీ ఉద్యోగులు, కార్మికుల జేఏసీ మీటింగ్ జరిగింది. ఇందులో సమ్మెను మరింత ఉధృ తం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు జేఏసీ చైర్మన్ పాలడుగు భాస్కర్, జనరల్ సెక్రటరీ యజ్ఞ నారాయణ్ ప్రణాళికను ప్రకటించారు. ఈ నెల 6న రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాలు, 7న రాస్తారోకోలు, 8,9,10 తేదీల్లో మహాపడావ్​లు, 13,14 తేదీల్లో మండలాల్లో రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. మీటింగ్ అనంతరం సెక్రటేరియెట్​లో పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియాను కలిసి సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు.