1985 తరువాత మళ్ళీ ఇంతకాలానికి.. వెల్కమ్ కమల్

1985 తరువాత మళ్ళీ ఇంతకాలానికి.. వెల్కమ్ కమల్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా ‘ప్రాజెక్ట్-K’ (Project-K) సినిమా అత్యంత భారీ బడ్జెట్‍తో రూపొందుతోంది. నాగ్ అశ్విన్(Nag Ashwin) దర్శకత్వం వహిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan), లోకనాయకుడు కమల్ హాసన్(Kamal hasan) నటిస్తున్న విషయం తెలిసేందే. స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణ్(Deepika Padukone), దిశా పఠానీ(Disha Patani) ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి: ఆదిపురుష్ ఎఫెక్ట్: 'ప్రభాస్'ని అగౌరవపరిచేలా వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్

తాజాగా అమితాబ్ బచ్చన్ , కమల్ హాసన్ కు  వెల్కమ్ చెబుతూ చేసిన ట్వీట్ ఆసక్తి రేపుతోంది. “ప్రాజెక్ట్-K లో నటిస్తునందుకు వెల్కమ్ కమల్. నీతో మళ్ళీ కలిసి పనిచేసే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. దీని కోసం ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్నా” అంటూ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. దీంతో అభిమానులు కాస్తా వీరిద్దరూ కలిసి చేసిన సినిమాల  గురుంచి నెట్టింట్లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. గతంలో వీరిద్దరూ కలిసి 1984 లో ‘ఖబడ్ధార్’(Khabardaar) అనే మూవీలో నటించారు.ఈ మూవీ కొన్ని అనివార్య కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోయింది. 

'ఖబర్దార్ ' మూవీ తెలుగు దర్శకుడు తాతినేని రామారావు దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో అనారోగ్యంతో బాధపడుతున్న రోగి పాత్రలో కమల్ నటించగా మరియు డాక్టర్ గా అమితాబ్ యాక్ట్ చేశాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఒక సంవత్సరం తర్వాత కమల్ హాసన్ మరియు అమితాబ్ బచ్చన్ 1985లో 'గెరాఫ్తార్'( Geraftaar) లో కలిసి పనిచేశారు.